
📌 Key Points
- అమీన్‌పూర్‌లో 861 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది.
- స్వాధీనం చేసుకున్న భూమి విలువ రూ. 15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
- ఇల్లు కట్టుకున్న పేదలకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు.
- కోర్టు తీర్పును లెక్కచేయకుండా నిర్మాణాలు చేసిన వారిపై చర్యలు తీసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ప్రభుత్వ యంత్రాంగం భారీ ఆపరేషన్ చేపట్టింది. సుమారు 861 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారుల సహాయంతో హైడ్రా స్వాధీనం చేసుకుంది. దీని విలువ దాదాపు రూ. 15 వేల కోట్లు ఉంటుందని అంచనా.
హైడ్రా ఆపరేషన్ వివరాలు
హైదరాబాద్ నగర చరిత్రలో నిలిచిపోయే భారీ ఆపరేషన్‌ను ప్రభుత్వ యంత్రాంగం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేని విదంగా 861 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులతో కలిసి హైడ్రా కాపాడింది. ఈ భూమి విలువ మార్కెట్లో రూ. 15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో పాటు ఇతర విభాగాలు ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఇప్పటికే ఇల్లు కట్టుకుని ఉన్న వారిని మినహాయించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇల్లు కట్టుకున్నపేదలు, సామాన్యులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఎప్పటికప్పుడు మైకులో అధికారులు మైకు ద్వారా ప్రకటించారు. దీంతో పేదలంతా ఊపిరి పీల్చుకున్నారు.
హైడ్రా ఫెన్సింగ్ కార్యక్రమానికి సహకరించారు. ఇదే సమంలో అక్కడ పాత లే ఔట్లలోని ప్లాట్ల యజమానులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. మా లే ఔట్లను కాపాడుకోడానికి మేమంతా కోర్టుకు వెళ్లి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు.. కాదు లే ఔట్లు వేశాం ఆ భూమి మాది అని అక్కడి ప్లాట్ల యజమానులు కోర్టులో పోరాడుతున్నారు. మధ్యలో ఎం. ఎ. ముఖీం అనేటోడు వచ్చి అన్యాయంగా ఆ భూములను తెగనమ్ముకోడానికి ఇన్నాళ్లకు ప్రభుత్వ యంత్రాంగం అడ్డుకట్ట వేసిందని హర్షం వ్యక్తం చేశారు.
కోర్టు తీర్పులు, వివాదాలు
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూరంలోని సర్వే నంబరు 1 నుంచి 220 వరకూ ఉన్న ప్రభుత్వ భూమిలో ఎలాంటి కట్టడాలు చేయరాదని 1998లో హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. ఆ తీర్పును ఏమాత్రం లెక్క చేయకుండా 2006లో ఎం. ఎ. ముఖీం గెస్టు హౌస్ కట్టాడు. గెస్ట్ హౌస్‌తో పాటు మొత్తం 40 ఎకరాల పరిధిలో ఫార్మ్ హౌస్ నిర్మించాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి హద్దులు పెట్టాడు. ఇక అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా అవకాశం లేకుండా కాపలా పెట్టాడు. ఇక్కడితో ఆగకుండా అక్కడ భూములను అమ్మడం ప్రారంభించాడు.
దీంతో అక్కడి లే ఔట్లున్న వారు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ భూమి స్వరూపాన్ని మార్చరాదని ఇరు పక్షాలకూ 2013లో హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. 2.20 ఎకరాల్లో ముఖీం సోదరుడు ఎంఏ అజీం నిర్మించిన 6 అంతస్తుల అపార్టుమెంట్‌ను కూల్చేసింది హైడ్రా. స్విమ్మింగ్‌పూల్‌తో సహా విలాసవంతంగా నిర్మించుకున్న గెస్టు హౌస్‌తో పాటు అక్కడ నిర్మించిన గదులను ఇంటిని.. ఇంటి చుట్టూ 40 ఎకరాల మేర గడీలు పెట్టి నిర్మించుకున్న ఫామ్ హౌస్‌ను, గుర్రాలకోసం నిర్మించిన శాలలను తొలగించారు.
కోర్టు తీర్పులు పెండింగ్ ఉండగా ఆ భూమితో ఎలాంటి సంబంధం లేని ముఖీంతో పాటు అతని అనుచరులు ఇష్టానుసారం అమ్మకాలు చేస్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. కోర్టు ఉత్తర్వులను ఏమాత్రం లెక్క చెయకుండా ప్లాట్లుగా అమ్మేస్తున్న వారికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి హైడ్రా చెక్ పెట్టింది. చట్టాలంటే భయం లేకుండా.. అధికారులను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా కబ్జాలు చేసి అక్కడ లావాదేవీలు నిర్వహిస్తున్నముఖీం కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పెట్టింది.
ప్రజల స్పందన
భారీ పోలీసు బందోబస్తు మధ్య 861 ఎకరాలకు ఫెన్సింగ్ వేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో హైడ్రా యంత్రాంగం ఈ భారీ ఆపరేషన్ నిర్వహించింది. ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వందల కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన ముఖీంకు హైడ్రా చెక్ పెట్టింది. 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. ఇప్పటికే కొన్ని ఇళ్లు నిర్మాణం జరిగింది. పేదలు కట్టుకున్న ఇళ్లను మినహాయించి ఖాళీగా ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కాపాడింది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
మొత్తానికి అమీన్‌పూర్‌లో జరిగిన ఈ భారీ ఆపరేషన్ సంచలనం సృష్టించింది. ప్రభుత్వ భూములను పరిరక్షించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది. కోర్టు తీర్పులు అమలు చేయడంలో అధికారులు కఠినంగా వ్యవహరించారు.


