|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ విజయం: పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మెగా 158 ప్రారంభం! సంక్రాంతి టార్గెట్ ఫిక్స్!

Published: 28-03-2026, 4:05 AM
మెగాస్టార్ విజయం: పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మెగా 158 ప్రారంభం! సంక్రాంతి టార్గెట్ ఫిక్స్!
  • పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మెగా158 సినిమా ప్రారంభం
  • 2027 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
  • తండ్రీకూతుళ్ల అనుబంధం నేపధ్యంలో భారీ యాక్షన్ డ్రామా
  • చిరంజీవి, ప్రియమణి, మోహన్ లాల్, అనురాగ్ కశ్యప్ నటిస్తున్నారు.

చిరంజీవి కొత్త సినిమా మెగా 158ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని KVN ప్రొడక్షన్స్ ఆఫీస్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సినిమాను సంక్రాంతి 2027లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మెగా158 ప్రారంభం

Mega158 Launch: మన శంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చిరు తాజాగా మరో సినిమాకి ముహుర్తం పెట్టేశాడు. యస్ ..వాల్తేరు వీరయ్య లాంటి సాలిడ్ హిట్ తర్వాత బాబీ మరోసారి చిరుతో చేయబోయే మెగా158 సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైనట్టు తెలుస్తుంది.

ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌లోని KVN ప్రొడక్షన్స్ ఆఫీస్‌లో ఈ సినిమా ఓపెనింగ్ కన్నుల పండగగా జరగగా ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి చిరంజీవిపై క్లాప్ కొట్టడం కొట్టడం విశేషం. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ మాస్ యాక్షన్ డ్రామాను KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నామని గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమాను 2027 సంక్రాంతి బరిలో నిలపాలని బాబీ ప్లాన్ చేస్తున్నాడని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. ఇప్పటికే బాబీ – చిరు కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.సో .. అదే సెంటిమెంట్‌ను ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారన్న మాట.అయితే ఇదే పొంగల్ బరిలో అనిల్ – వెంకీ సినిమా కూడా వస్తున్న సంగతి తెల్సిందే.మరి వచ్చే పొంగల్ దంగల్ లో చిరు – వెంకీల మధ్య పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుందో చూడాలి.

సంక్రాంతి 2027 లక్ష్యంగా భారీ చిత్రం

మొదటి షెడ్యూల్‌లో చిరంజీవి పై సోలో ఎంట్రీ సీన్స్‌

ఇక మొదటి షెడ్యూల్‌లో భాగంగా చిరంజీవి పై సోలో ఎంట్రీ సీన్స్‌ను చిత్రీకరించనున్నారని ఆ తర్వాత వెంటనే ఓ మాస్ సాంగ్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, మలయాళ స్టార్ మోహన్ లాల్, అనురాగ్ కశ్యప్, బండ్ల గణేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ మేకర్స్ ఎక్కడా క్లారిటీ ఇవ్వని పరిస్థితి.

తండ్రీకూతుళ్ల అనుబంధంతో మాస్ యాక్షన్ డ్రామా

మొత్తానికి పవన్ కళ్యాణ్ క్లాప్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌కు ఒక గ్లోబల్ హైప్ వచ్చేసిందన్నది నిజం . మరి ‘వాల్తేరు వీరయ్య’ మ్యాజిక్‌ను బాబీ మళ్లీ రిపీట్ చేస్తారా? సంక్రాంతి బరిలో చిరు మళ్లీ విన్నర్‌గా నిలుస్తారా? అనేది కాలమే డిసైడ్ చేయాలి !

మొత్తానికి, పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మెగా 158కి మంచి హైప్ వచ్చింది. వాల్తేరు వీరయ్య లాగే ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలి. సంక్రాంతి బరిలో చిరు గెలుస్తారో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.