
📌 Key Points
- ‘మెగా 158’ ముహూర్తం మే 21న ఉదయం 8 గంటలకు అత్యంత వైభవంగా ఖరారు.
- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
- చిరంజీవి, పవన్, చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు అరుదైన, అపురూపమైన దృశ్యం.
- వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి-బాబీ కొల్లి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండటంతో భారీ అంచనాలు.
ఎట్టకేలకు ‘మెగా 158’ చిత్రం ముహూర్తం ఖరారైంది. మే 21న గ్రాండ్‌గా ప్రారంభం కానున్న ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. చిరంజీవి, పవన్, చరణ్ ఒకే వేదికపై కనిపించనుండటంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ మెగా ఈవెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
మెగా 158: భారీ అంచనాలతో ప్రారంభం
Mega 158 : ఇండస్ట్రీ అంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ‘మెగా 158’ (Mega 158) ఎట్టకేలకి ముహుర్తం పెట్టుకోబోతుంది. ఈ ప్రాజెక్టుపై గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఎట్టకేలకు ఈ భారీ చిత్రం రేపు మే 21న ఉదయం 8 గంటలకు అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలను చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేసింది.
మెగా ఫ్యామిలీ పవర్‌ను చాటిచెప్పే మెగా ఈవెంట్
అయితే, ఈ వేడుకను కేవలం ఒక సినిమా ప్రారంభోత్సవంగా మాత్రమే కాకుండా, మెగా ఫ్యామిలీ పవర్‌ను ప్రపంచానికి చాటిచెప్పే ఒక మెగా ఈవెంట్‌గా మార్చబోతున్నారట మేకర్స్.ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో అతిపెద్ద హాట్ టాపిక్. ఒకవైపు అటు రాజకీయాల్లో బిజీగా ఉన్నా, ఇటు సినిమా వేడుకల కోసం తన అన్నయ్య కోరిక మేరకు పవన్ కళ్యాణ్ రాక, అభిమానుల్లో జోష్‌ను రెట్టింపు చేసింది.
పవన్, చరణ్ రాకతో మెగా పవర్
ఈ సందర్భంగా కేవీఎన్ ప్రొడక్షన్స్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “ది సెలబ్రేషన్ రీచెస్ పీక్ పవర్” అంటూ పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్‌తో ఉన్న పోస్టర్‌ను చూస్తుంటే, ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతోంది. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ వేడుకకు హాజరుకానుండటం విశేషం. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. ముగ్గురు మెగా హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూసే అరుదైన అవకాశం అభిమానులకు దక్కబోతోంది. చాలా కాలం తర్వాత మెగా కుటుంబంలోని ఈ టాప్ స్టార్స్ కలయిక, సినిమా ఇండస్ట్రీలోనే ఒక అపురూపమైన దృశ్యంగా నిలిచిపోనుందనడం లో సందేహం లేదు.
ఎలాంటి సంచలనాలకి కేరాఫ్ అవుతుందో
చిరంజీవి-బాబీ కాంబినేషన్ మ్యాజిక్
ఇక ఈ మూవీ చిరంజీవి కెరీర్‌లో స్పెషల్ ప్రాజెక్ట్ కావడానికి మరో ప్రధాన కారణం డైరెక్టర్ బాబీ కొల్లి. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ను పర్ఫెక్ట్ ప్యాకేజీగా అందించడంలో బాబీది అందె వేసిన చెయ్యని అతని గత సినిమాలే చెబుతాయి.
ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండటంతో, ఈ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిర్మాత వెంకట్ కె. నారాయణ ఎక్కడా రాజీ పడకుండా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడని ఇప్పటికే అనౌన్స్ అయిన సంగతి తెల్సిందే.చూడాలి మరి భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలకి కేరాఫ్ అవుతుందో !
చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే వేదికపై కనిపించనుండటంతో ‘మెగా 158’ ప్రారంభోత్సవం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ మెగా ఈవెంట్ అభిమానులకు పండగే.


