
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రిలీజ్ తో థియేటర్లు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, మిరాయ్ సినిమా యూనిట్ ఒక ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. తేజ సజ్జ మరియు నిర్మాత విశ్వప్రసాద్ తమ అభిమానాన్ని చాటుకుంటూ…
Key Points
పవన్ కళ్యాణ్ OG సినిమా రిలీజ్ తో థియేటర్లలో స్క్రీన్స్ కొరత.
మిరాయ్ సినిమా హీరో తేజ సజ్జ మరియు నిర్మాత విశ్వప్రసాద్ ఆశ్చర్యకర నిర్ణయం.
పవన్ కళ్యాణ్ అభిమానానికి నిదర్శనంగా మిరాయ్ సినిమా షోలు తాత్కాలికంగా నిలిపివేత.
శుక్రవారం నుండి సెలెక్టెడ్ థియేటర్లలో మళ్ళీ ప్రదర్శన.
OG సినిమా రిలీజ్ తో థియేటర్ల పరిస్థితి
Mirai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపే రిలీజ్ కానుంది. సినిమా మీద ఉన్న హైప్ తో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అయిపోయాయి. అడ్వాన్స్ సేల్స్ తోనే దాదాపు 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది OG సినిమా. మామూలుగానే స్టార్ హీరోల సినిమాలు వస్తే థియేటర్స్ అన్ని ఆ సినిమానే వేస్తాయి. మల్టీప్లెక్స్ లలో మాత్రమే వేరే సినిమాలకు స్క్రీన్స్ దొరుకుతాయి.(Mirai OG)
అలాంటిది పవర్ స్టార్ సినిమా, ఇంత హైప్ ఉన్న సినిమా రిలీజ్ అవుతుండటంతో థియేటర్స్, మల్టిప్లెక్స్ స్క్రీన్స్ అన్ని OG తోనే నిండిపోతాయి. ఒక్క హైదరాబాద్ లోనే మొదటి రోజు 550 షోలు వేస్తున్నారు, అవన్నీ ఆల్రెడీ హౌస్ ఫుల్ అవ్వడం గమనార్హం. అయితే కొన్ని స్క్రీన్స్ మాత్రం గత రెండు వారాలుగా ఆడుతున్న సినిమాలు నడుస్తున్నాయి.
మిరాయ్ యూనిట్ యొక్క ఆశ్చర్యకర నిర్ణయం
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో మిరాయ్ సినిమా హీరో తేజ సజ్జ, నిర్మాత విశ్వప్రసాద్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. OG రిలీజ్ సెప్టెంబర్ 25న మిరాయ్ సినిమా ఆడే థియేటర్స్, స్క్రీన్స్ అన్ని కూడా OG సినిమాకు ఇవ్వాలని నిర్మాత విశ్వప్రసాద్ డిసైడ్ అయ్యారు. దీంతో గురువారం మిరాయ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో షోలు పడట్లేదు. మళ్లీ శుక్రవారం నుంచి సెలెక్టెడ్ స్క్రీన్ ల్లో మిరాయ్ సినిమా వేయనున్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానుల స్పందన
మిరాయ్ నిర్మాత విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ కి క్లోజ్ అని అందరికి తెలిసిందే. ఇక తేజ సజ్జ చిన్నప్పట్నుంచి మెగా అభిమాని అని తెలిసిందే. దీంతో మిరాయ్ యూనిట్ తీసుకున్న నిర్ణయానికి పవన్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానం మిరాయ్ సినిమా యూనిట్ నిర్ణయంలో స్పష్టంగా కనిపించింది. తమ అభిమానాన్ని చాటుకున్న హీరో, నిర్మాతలకు అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు.


