
📌 Key Points
- MJPTBCWREIS 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల రెండో జాబితా విడుదల.
- ఫలితాలను tgcet.cgg.gov.in, mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్లలో చూడవచ్చు.
- సీటు సాధించిన విద్యార్థులు జూన్ 5 నుండి ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలి.
- జూనియర్ కాలేజీ విద్యార్థులు జూన్ 4 లోగా రిపోర్ట్ చేయకపోతే సీటు కోల్పోతారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యా సంస్థల సంస్థ (MJPTBCWREIS) కీలక ప్రకటన చేసింది. బీసీ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. ఇది ప్రభుత్వ విద్యా సంక్షేమ కార్యక్రమాలకు నిదర్శనం.
గురుకుల బ్యాక్‌లాగ్ సీట్ల ఫలితాలు విడుదల
TG MJPTBCWREIS Results 2026 : రాష్ట్రంలోన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంస్థ (MJPTBCWREIS) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితాను బుధవారం (జూన్ 3) విడుదల చేశారు. ఈ మేరకు సొసైటీ ఇన్ ఛార్జ్ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఫలితాలను సొసైటీ అధికారిక వెబ్‌సైట్లలో పరిశీలించుకోవచ్చు. అభ్యర్థులు https://tgcet.cgg.gov.in/TGCETWEB/#/home లేదా https://mjptbcwreis.telangana.gov.in లింకుల ద్వారా తమ సెలక్షన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చని కార్యదర్శి సూచించారు.
రిజల్ట్ లింకులు, రిపోర్టింగ్ తేదీలు
ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపి, మెరిట్ ఆధారంగా రెండో విడతలో సీటు సాధించిన విద్యార్థులకు సంబంధిత గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. విద్యార్థులు ఏ తేదీన పాఠశాలకు హాజరై అడ్మిషన్ తీసుకోవాలనే పూర్తి వివరాలను ఫోన్ కాల్‌లోనే తెలియజేస్తారని డాక్టర్ మల్లయ్య భట్టు స్పష్టం చేశారు. మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన విద్యార్థులందరూ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని ఆయన కోరారు. వీరికి సీట్ల కేటాయింపు, ప్రవేశాల భర్తీ ప్రక్రియ ఈ నెల 5వ తేదీ (జూన్ 5) నుంచి ప్రారంభం కానుంది.
బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో మొదటి విడత (ఫస్ట్ లిస్ట్) లో సీట్లు సాధించిన విద్యార్థులకు కూడా అధికారులు కీలక అలర్ట్ ఇచ్చారు. సీట్లు వచ్చిన అభ్యర్థులు ఈ నెల 4వ తేదీ (గురువారం) లోగా తమకు కేటాయించిన కాలేజీల్లో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా రిపోర్ట్ చేయని విద్యార్థులు తమ సీటును కోల్పోయే అవకాశం ఉందని, కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి త్వరపడాలని డాక్టర్ మల్లయ్య భట్టు స్పష్టం చేశారు.
జూనియర్ కాలేజీ విద్యార్థులకు కీలక అలర్ట్
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సకాలంలో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ విద్యా పథకాలు మరింత మందికి చేరేలా ఈ ప్రక్రియ దోహదపడుతుంది.

