|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: నా పెళ్లి లవ్ జిహాద్ కాదు.. డైరెక్టర్‌కు మోనాలిసా స్ట్రాంగ్ కౌంటర్!

Published: 12-03-2026, 8:35 AM
షాకింగ్: నా పెళ్లి లవ్ జిహాద్ కాదు.. డైరెక్టర్‌కు మోనాలిసా స్ట్రాంగ్ కౌంటర్!
  • కుంభమేళాలో పూసలు అమ్ముతూ సెలబ్రిటీగా మారిన మోనాలిసా, ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకుంది.
  • దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ పెళ్లిని ‘లవ్ జిహాద్’ అని విమర్శించగా, మోనాలిసా కౌంటర్ ఇచ్చింది.
  • కుటుంబం అడ్డు చెప్పడంతో కేరళలోని ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది.
  • తనకు అన్ని మతాల పట్ల గౌరవం ఉందని, తన పెళ్లిని లవ్ జిహాద్ అని ముద్ర వేయొద్దని మోనాలిసా కోరింది.

కుంభమేళాలో పూసలు అమ్ముతూ ఫేమస్ అయిన మోనాలిసా భోంస్లే, ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈ పెళ్లిని లవ్ జిహాద్ అంటూ విమర్శించడంతో మోనాలిసా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ వివాహం

Monalisa Bhosle: ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయిన మోనాలిసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె హిందీ, మలయాళం అలాగే తెలుగు సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్నా మోనాలిసా(Monalisa) ఊహించని విధంగా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్(Farmann Khann) తో పెళ్లి పీటలు ఎక్కారు. ఫేస్ బుక్ ద్వారా ఇతను పరిచయం కావడంతో గత ఏడాదిన్నరగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లికి కుటుంబం అడ్డుపడటంతో ఈ జంట కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అరుమనూరు శ్రీ నైనార్ దేవా ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. హిందూ సాప్రదాయాల ప్రకారమే వీరి వివాహం జరిగింది.

ఈ విధంగా మోనాలిసా పెళ్లి చేసుకోవడంతో వీరి పెళ్లిపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మోనాలిసాను ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఈమె పెళ్లి పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా ప్రేమతో పెళ్లి చేసుకోలేదని, ప్రలోభాలకు లొంగిపోయి పెళ్లి చేసుకుందని ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రేమ వివాహం కాదని “లవ్ జిహాద్”(Love Jihad) అంటూ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

దర్శకుడి లవ్ జిహాద్ ఆరోపణలు

ఈ సందర్భంగా డైరెక్టర్ సనోజ్ మిశ్రా చేసిన ఈ వ్యాఖ్యలపై మోనాలిసా స్పందించారు. దయచేసి తన పెళ్లిని లవ్ జిహాద్ అని ముద్ర వేయద్దు నా పెళ్లి హిందు సాంప్రదాయాల ప్రకారమే జరిగిందని తనకు అన్ని మతాల పట్ల ఎంతో గౌరవం ఉందని తెలిపారు. ప్రస్తుతం తాను మేజర్ కావడంతో తనకి ఇష్టమైన వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకొనే హక్కు కూడా తనకు ఉంది అంటూ మోనాలిసా డైరెక్టర్ సనోజ్ మిశ్రా వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ వివాహం మోనాలిసాకు ఇష్టమైనప్పటికీ తన తండ్రి విజయ సింగ్ భోంస్లేకు ఏ మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. ఇలా తన తండ్రి బలవంతంగా తనకు వేరే వివాహం చేయబోతున్న నేపథ్యంలోనే ఈమె తన ప్రియుడుతో కలిసి కేరళలోని పోలీసులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఇలా పోలీసులను ఆశ్రయించిన కొద్ది సమయానికే ఈమె కేరళలోని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇక మోనాలిసా సినిమాల విషయానికి వస్తే మలయాళంలో నాగమ్మ సినిమాతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో కూడా నటించారు. ఇక తెలుగులో మోనాలిసా “లైఫ్”(Life Film) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి చేసుకున్న మోనాలిసా యధావిధిగా సినిమాలలో నటిస్తారా లేదంటే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా అనేది తెలియాల్సి ఉంది.

మోనాలిసా కౌంటర్

ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోనాలిసా తన వ్యక్తిగత జీవితం గురించి తీసుకున్న నిర్ణయంపై వస్తున్న విమర్శలను ధైర్యంగా ఎదుర్కొంటోంది. ఆమె తన వైఖరిని స్పష్టంగా తెలియజేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.