|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోనాలిసా సంచలనం: ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మోనాలిసా భోంస్లే! అసలేం జరిగింది?

Published: 11-03-2026, 9:05 AM
మోనాలిసా సంచలనం: ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మోనాలిసా భోంస్లే! అసలేం జరిగింది?
  • సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మోనాలిసా భోంస్లే.
  • తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ తో వివాహం కోసం పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా.
  • తల్లిదండ్రుల నుండి రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు.
  • తెలుగులో సాయి చరణ్ హీరోగా ‘లైఫ్’ అనే సినిమాలో మోనాలిసా అవకాశం.

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మోనాలిసా భోంస్లే తన ప్రియుడితో కలిసి పోలీసులను ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె తన తల్లిదండ్రుల నుండి రక్షణ కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం.

మోనాలిసా భోంస్లే ఎవరు?

Monalisa Bhosle: సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇటీవల కాలంలో కొంతమంది రాత్రికి రాత్రి పాపులర్ అవుతూ జీవితంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో మోనాలిసా భోంస్లే (Monalisa Bhosle) కూడా ఒకరు. ఈమె ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముతూ కనిపించారు. అయితే ఈమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మోనాలిసా రాత్రికి రాత్రి పాపులర్ అవ్వడమే కాకుండా, హీరోయిన్ గా సినిమా అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో చాలా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్న మోనాలిసా తాజాగా కేరళ పోలీసులను ఆశ్రయించడంతో వార్తల్లో నిలిచారు. అసలు మోనాలిసా పోలీసులను ఆశ్రయించడానికి గల కారణాలు ఏంటి? ఏం జరిగింది? అనే విషయానికి వస్తే.. మోనాలిసా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈమె గత ఏడాదిన్నరగా ఫేస్ బుక్ ద్వారా తనకు పరిచయమైన ఫర్మాన్ ఖాన్(Farmaan Khan) అనే వ్యక్తితో ప్రేమలో పడ్డారు. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కావటం విశేషం. ఇలా గత ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అయితే వీరి పెళ్లికి మోనాలిసా తల్లిదండ్రులు ఏమాత్రం అంగీకారం తెలపలేదు.

పోలీసులను ఆశ్రయించడానికి కారణం?

ఈ నేపథ్యంలోనే మోనాలిసా తిరువనంతపురంలోని తప్పనూరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు తన ప్రియుడితో తనకు వివాహం చేయాలని అలాగే తన తల్లితండ్రుల నుంచి మాకు రక్షణ కల్పించాలని ఈమె ఫిర్యాదులు పేర్కొన్నారు. తన తల్లిదండ్రుల నుంచి నచ్చని వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. తన తల్లితండ్రులు శారీరకంగా తనకు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదని బలవంతపు వివాహం చేసుకోమని ఒత్తిడి చేయడంతోనే పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.

తెలుగులో ఛాన్స్ కొట్టేసిన మోనాలిసా..

తెలుగులో మోనాలిసాకు ఛాన్స్!

ఇలా ప్రియుడుతో పెళ్లి కోసమే ఈమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడ అనే విషయం తెలిసే అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు. అదేవిధంగా మలయాళంలో నాగమ్మ అనే సినిమాలో నటించినది. ఇలా బాలీవుడ్ మలయాళం సినిమాలు మాత్రమే కాకుండా మోనాలిసా తెలుగులో కూడా ఓ సినిమా అవకాశాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈమె సాయి చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘లైఫ్’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది ప్రస్తుతం షూటింగ్ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం మోనాలిసా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె తెలుగులో సాయి చరణ్ హీరోగా నటిస్తున్న ‘లైఫ్’ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.