|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కోలీవుడ్‌లో మృణాళ్ సునామీ! శింబుతో జోడీ కట్టనుందా? సంచలన ప్రకటన!

Published: 27-01-2026, 12:35 PM
కోలీవుడ్‌లో మృణాళ్ సునామీ! శింబుతో జోడీ కట్టనుందా? సంచలన ప్రకటన!
  • మృణాళ్ ఠాకూర్ త్వరలో కోలీవుడ్‌లో శింబు సరసన నటించే అవకాశం.
  • దర్శకుడు అశ్వత్ మారిముత్తు సినిమాలో మృణాళ్ హీరోయిన్‌గా ఎంపికయ్యే సూచనలు.
  • చిత్ర బృందం మృణాళ్‌ను సంప్రదించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
  • అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

మృణాళ్ ఠాకూర్ త్వరలో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టే అవకాశం ఉంది. రొమాంటిక్ హీరో శింబుతో కలిసి ఆమె అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కోలీవుడ్‌లోకి మృణాళ్ ఠాకూర్?

Mrunal Thakur: మృణాళ్ ఠాకూర్ ఇటీవల కాలంలో సినిమాల కంటే కూడా తన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.  బుల్లితెర సీరియల్స్ ద్వారా తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టి ప్రస్తుతం బాలీవుడ్ ,టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ రెండు భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మృణాళ్ డేటింగ్ గురించి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న  ఈ వార్తలపై ఈమె ఎక్కడ స్పందించలేదు. ఇలా రూమర్లను పక్కనపెట్టి మృణాళ్ పూర్తిగా తన కెరియర్ పైనే దృష్టి సారించారు. ప్రస్తుతం  ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో అడవి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్(Decoit) సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమెకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అతి త్వరలోనే మృణాళ్ ఠాకూర్ తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కోలీవుడ్ రొమాంటిక్ హీరో శింబు,(Simbu) సినిమాలో మృణాళ్ హీరోయిన్ గా నటించబోతున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలా ఈమె తమిళ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె శింబుతో చేయబోయే సినిమా ఏది అనే విషయానికి వస్తే…ఓ మై కడవలే, డ్రాగన్ చిత్రాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అశ్వత్ మారిముత్తు(Ashwath mari muthu) దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే.

శింబుతో కలిసి నటించే అవకాశం

ప్రస్తుతం అశ్వత్ మారి ముత్తు దర్శకత్వంలో హీరో శింబు ఓ సినిమాకు కమిట్ అయ్యారు. గత ఏడాది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందని అధికారకంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కి సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి. కోలీవుడ్ సమాచారం ప్రకారం అశ్వత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శింబుకి జోడిగా మృణాళ్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ విషయం గురించి ఇప్పటికే చిత్ర బృందం మృణాళ్‌ను సంప్రదించగా ఆమె కూడా సానుకూలంగా స్పందిస్తూ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

తమిళ సినిమాపై ఫోకస్ చేసిన మృణాళ్…

దర్శకుడు అశ్వత్ మారిముత్తు సినిమా

ఇలా మృణాళ్‌ ఈ ప్రాజెక్టులో భాగమైనట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ చిత్ర బృందం నుంచి ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన వెలువడలదు. మరి ఈ సినిమాలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే చిత్రబృందం అధికారక ప్రకటన వెల్లడించే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక నటుడు శింబు సినిమా అంటే భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఈయనకు తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి స్టార్ హీరో సినిమాలో నటిస్తూ ఈమె తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడితే అక్కడ కూడా తనకు మంచి ఫాలోయింగ్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

మొత్తానికి మృణాళ్ కోలీవుడ్‌లో అడుగుపెడుతుందా లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఇది నిజమైతే, ఆమె కెరీర్‌కు ఇది ఒక పెద్ద మలుపు కావచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.