|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

MSVPG Film: చిరు శశిరేఖ సాంగ్… లిరిక్సే కాదు.. స్టెప్స్ కూడా కాపీనేనా?

Published: 07-12-2025, 2:48 AM
MSVPG Film: చిరు శశిరేఖ సాంగ్… లిరిక్సే కాదు.. స్టెప్స్ కూడా కాపీనేనా?
  • మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడిల MSVPG చిత్రం సంక్రాంతి పండుగకు విడుదల కానుంది.
  • తాజాగా విడుదలైన సినిమాలోని ‘శశిరేఖ’ పాటపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
  • పాట లిరిక్స్‌తో పాటు డాన్స్ స్టెప్స్ కూడా కాపీ చేశారంటూ నెటిజన్లు ఆరోపణలు చేస్తున్నారు.
  • చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం పొందుతోంది.

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలోని ‘శశిరేఖ’ పాట వివాదంలో చిక్కుకుంది. లిరిక్స్‌తో పాటు డాన్స్ స్టెప్స్ కూడా కాపీ చేశారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పుడు ఈ పాట హాట్ టాపిక్‌గా మారింది.

శశిరేఖ పాట విడుదల: స్పందన, విమర్శలు

MSVPG Film: మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Prasad Garu). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన మీసాల పిల్ల అంటూ సాగిపోయే పాట అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా నుంచి “శశిరేఖ”అంటూ సాగిపోయే పాటను విడుదలచేశారు.

గత రెండు రోజుల క్రితం ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అలాగే కొంతమంది ఈ సాంగ్ పై కాస్త విమర్శలు కూడా చేశారు ఈ పాట అచ్చం కాత్యాయని అనే పాటలాగే ఉంది అంటూ విమర్శలు కురిపించారు. ఇక తాజాగా పూర్తి లిరికల్ వీడియోని విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఈ సాంగ్ చూసిన అనంతరం పాట మాత్రమే కాదు స్టెప్పులు కూడా కాపీ కొట్టారు అంటూ మరి కొంతమంది విమర్శిస్తున్నారు. చుట్టూ అందమైన లోకేషన్లలో ఈ పాటను చిత్రీకరించారని తెలుస్తోంది.. ఇక ఈ పూర్తి పాట విడుదల కావడంతో ఈ పాట ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

కాపీ ఆరోపణలు: లిరిక్స్, స్టెప్స్ రెండూ

ఈ సినిమాకు బీమ్స్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక శశిరేఖ అంటూ సాగిపోయే ఈ పాటను భీమ్స్, సింగర్ మధుప్రియ ఎంతో అద్భుతంగా ఆలపించారు.మన శంకర వరప్రసాద్ గారు సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైర్నర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించడానికి మరోసారి అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నారు. గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తాజాగా శంకర్ వరప్రసాద్ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

చిరంజీవి దాదాపు 20 సంవత్సరాల తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి ప్రసాద్ అనే పాత్రలో కనిపించబోతుండగా నయనతార శశిరేఖగా కనిపించబోతున్నారు. ఇక ఇద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల కూడా మంచి అంచనాలే ఉన్నాయి.. మరి శంకర్ ప్రసాద్ గారు అంటూ రాబోతున్న చిరంజీవి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సాహుగారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా నుంచి వరుస అప్డేట్స్ వెల్లడి కానున్నాయి.

MSVPG సినిమా: సంక్రాంతి విడుదల, అంచనాలు

శశిరేఖ పాటపై వస్తున్న కాపీ ఆరోపణలు సినిమా ప్రమోషన్‌కు కొత్త రంగు పులుముతున్నాయి. విమర్శల మధ్య ఈ పాట, చిత్రం ఎంతమేర విజయం సాధిస్తాయో వేచి చూడాలి. సంక్రాంతికి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.