|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మైత్రీ మూవీ మేకర్స్ చేతికి ‘హ్యాపీ రాజ్’.. జీవీ ప్రకాష్ కుమార్ మెరుపులు!

Published: 13-03-2026, 3:05 PM
మైత్రీ మూవీ మేకర్స్ చేతికి 'హ్యాపీ రాజ్'.. జీవీ ప్రకాష్ కుమార్ మెరుపులు!
  • మైత్రీ మూవీ మేకర్స్ ‘హ్యాపీ రాజ్’ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమైంది.
  • ఈ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్నారు.
  • ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన మరియా రాజా దర్శకత్వం వహించారు.
  • ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా తెలుగు ప్రమోషన్లు ప్రారంభించారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ‘హ్యాపీ రాజ్’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించనుంది. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మరియా రాజా ఎలాంచెజియన్ తెరకెక్కించారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

మైత్రీ మూవీ మేకర్స్ విడుదల

Happy Raj: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అగ్రగామి నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ‘పుష్ప 2’ తర్వాత ఈ బ్యానర్ స్థాయి పాన్ ఇండియాకు చేరింది. మరో వైపు మైత్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా అద్భుతంగా కొనసాగుతోంది. టాలీవుడ్ నుంచే కాకుండా ఇతర భాషల నుంచి కూడా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలను అందిస్తోంది. మైత్రీ నిర్మాతల డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘హ్యాపీ రాజ్’ (Happy Raj) అనే చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన చేసింది. ఈ చిత్రంలో కంపోజర్-హీరో జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) హీరోగా నటిస్తుండగా.. స్టార్ హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద ఈ చిత్రాన్ని కోలీవుడ్‌లో నిర్మించారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. గ్యారంటీ హిట్ అనే ఫీల్‌ని ఇచ్చింది. దీంతో మైత్రీ వారు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఇప్పటికే తమిళ్‌లో పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షఖులకు బాగా నచ్చేసింది కూడా. ఇప్పుడు కలర్, యాటిట్యూడ్, మాస్ టోన్‌తో వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో తెలుగు ప్రమోషన్లను కూడా ప్రారంభించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ గమనిస్తే.. జివి ప్రకాష్ కుమార్ కాన్ఫిడెంట్‌గా నల్లటి సూట్, ఓపెన్-కాలర్ షర్ట్, సన్ గ్లాసెస్ ధరించి, స్ట్రీట్-స్మార్ట్‌గా ఆటో రిక్షా నుండి బయటకు వస్తున్నారు. ఫస్ట్ లుక్ స్టైలిష్‌గా ఉండటమే కాకుండా అందరిదృష్టిని ఆకర్షిస్తోంది.

జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా

టైటిల్‌కు తగ్గట్టే.. ఆయన చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఇంకా కొన్ని స్టిల్స్‌ని కూడా మైత్రీ వారు విడుదల చేశారు. ఈ స్టిల్స్‌లో హీరోహీరోయిన్లు షాపింగ్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. హీరోయిన్ చాలా అందంగా కనిపిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో అబ్బాస్, జార్జ్, గీతా కైలాసం, ప్రార్థన నాథన్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘హ్యాపీ రాజ్’ రిఫ్రెషింగ్ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం మార్చి 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP (Mythri Movie Distributors LLP) సపోర్ట్‌తో ఈ చిత్రం తెలుగులో స్ట్రాంగ్ రన్ అందుకుని, మంచి సక్సెస్ అవుతుందని చిత్రయూనిట్ కూడా భావిస్తోంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

Vastunnadu… #HappyRaj 😎 Happy vibes entering Telugu screens 🌟 With @Mythrirelease 🎬🔥 @jaivarda04 @SureshJaikanth @gvprakash @actorabbas @srigouripriya @maria_raja_elan @justin_tunes #GeorgeMaryan @kailasam_geetha @madhandop @editorselva @kumar_gangappan @praveenraja_off … pic.twitter.com/F2P6x6MHM7

ఫస్ట్ లుక్ విడుదల

— Beyondpicturesindia (@beyondoffcl) March 12, 2026

‘హ్యాపీ రాజ్’ చిత్రం విడుదల కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.