
📌 Key Points
- గరికపాటి నరసింహారావు, నా అన్వేషణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
- “నేను బ్రహ్మ దేవుడిని, నాతో పెట్టుకోకు” అంటూ గరికపాటికి నా అన్వేషణ సంచలన హెచ్చరిక.
- నా అన్వేషణ తన బాల్యం, అమెరికాలో ఉద్యోగం, సోమాలియా ప్రయాణం వంటి వ్యక్తిగత విషయాలను వెల్లడించారు.
- హిందూ దేవతలపై వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే నా అన్వేషణపై కేసులు, భారీగా అన్ ఫాలో అయ్యారు.
గరికపాటి నరసింహారావు, నా అన్వేషణ మధ్య మాటల యుద్ధం ఉధృతం అవుతోంది. తాజాగా, “నేను బ్రహ్మ దేవుడిని, నాతో పెట్టుకోకు” అంటూ నా అన్వేషణ గరికపాటికి సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు చర్చనీయాంశంగా మారాయి.
గరికపాటి, నా అన్వేషణ మధ్య కోల్డ్ వార్
Garikapati vs Naa Anveshana: గరికపాటి నరసింహరావు నా అన్వేషణ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకరి పై ఒకరు విమర్శలు కురిపించుకుంటున్నారు. నా అన్వేషణ శివాజీ విషయంలో గరికపాటి ప్రవచనాలకు సంబంధించిన వీడియో గురించి ప్రస్తావించి ఆయనపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి నా అన్వేషణ తరచూ గరికపాటికి కౌంటర్లు ఇస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. గరికపాటి కూడా నా అన్వేషణకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే మరోసారి నా అన్వేషణ గరికపాటి గురించి మాట్లాడుతూ వెటకారంగా ఆయనపై విమర్శలు చేస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తన తల్లిదండ్రుల బ్యాక్ గ్రౌండ్ గురించి ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే తాను అమెరికాలో బాత్రూంలు కడిగే ఉద్యోగం చేశానని అన్వేషణ తెలిపారు. కరోనా సమయంలో పెళ్లి కుదిరితే ఆ పెళ్లి కూడా పెటాకులు అయిందని, ఆ సమయంలో చనిపోవాలని నిర్ణయం తీసుకున్నానని అన్వేషణ తెలియజేశారు. ఇండియాలో చనిపోతే ఏమి రాదు అది బయట దేశాలలో చనిపోతే డబ్బులు వస్తాయని ,50 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకొని సోమాలియా వెళ్లిపోయానని తెలియజేశారు.
“నేను బ్రహ్మ దేవుడిని”: నా అన్వేషణ సంచలన వ్యాఖ్యలు
సోమాలియా నుంచి నా విదేశాల పర్యటన మొదలైందని అన్వేషణ తెలియజేశారు. ఇక ఈ వీడియోలో భాగంగా గరికపాటి గురించి కూడా మాట్లాడుతూ.. గరికపాటి మీ గోత్రనామాలు అన్ని నాకు తెలుసని, నాపై యుద్ధం ప్రకటించడం ఏంటని? ప్రశ్నించారు. నేను బ్రహ్మ దేవుడిని, గరికపాటి విష్ణువు, చాగంటి శివుడు.. మన ముగ్గురం త్రిమూర్తులము. నన్ను ఎవరు ఏమి చేయలేరని తెలియజేశారు. ఇక సోషల్ మీడియా వేదికగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని ఎప్పుడూ నేను ఎవరిని అడగలేదు. నేను అడగకుండానే వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లే అన్ ఫాలో చేస్తూ వెళ్లిపోయారని అన్వేషణ తెలిపారు.
ఇలా తాను బ్రహ్మ దేవుడిని నన్ను ఎవరు ఏం చేయలేరు అంటూ నా మాట్లాడిన మాటలు మరో వివాదానికి కారణమయ్యాయి. ఇక ఈ వీడియో పై గరికపాటి స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇలా హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతూ నా అన్వేషణ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలిచారు. ఇక ఈయనపై హిందూ సంఘాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే హిందువుల గురించి ఇండియా గురించి ఈయన మాట్లాడిన మాటల కారణంగా దాదాపు పది లక్షలకు పైగా ఈయనని అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే.
మునుపటి వివాదాలు, హిందూ సంఘాల ఆగ్రహం
నా అన్వేషణ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. హిందూ దేవుళ్ళపై ఆయన గత వ్యాఖ్యల వల్ల ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ తాజా వ్యాఖ్యలపై గరికపాటి స్పందన ఏమిటన్నది వేచి చూడాలి.


