|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Naga Vamsi : వార్ 2 ఫ్లాప్ అని ఒప్పుకున్న నిర్మాత.. బాలీవుడ్ నిర్మాతని నమ్మి.. తప్పు జరిగింది అంటూ..

Published: 21-10-2025, 10:10 AM
Naga Vamsi : వార్ 2 ఫ్లాప్ అని ఒప్పుకున్న నిర్మాత.. బాలీవుడ్ నిర్మాతని నమ్మి.. తప్పు జరిగింది అంటూ..

ఇటీవల ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా ‘వార్ 2’ తెలుగులో ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. ఈ సినిమా తెలుగు హక్కులను కొని రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ, ‘వార్ 2’ ఫ్లాప్ అని ఒప్పుకున్నారు. బాలీవుడ్ నిర్మాతలను నమ్మడం తప్పు జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Key Points

1

నిర్మాత నాగవంశీ 'వార్ 2' సినిమా ఫ్లాప్ అని బహిరంగంగా ఒప్పుకున్నారు.

2

బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రా, యష్ రాజ్ ఫిలిమ్స్‌ని నమ్మి తప్పు జరిగిందని పేర్కొన్నారు.

4

తెలుగు హక్కులకు రూ. 90 కోట్లు ఖర్చు చేసినా, సినిమా తెలుగు రాష్ట్రాల్లో నష్టాలను చూసింది.

నాగవంశీ వార్ 2 ఫ్లాప్‌పై స్పందన

Naga Vamsi : ఇటీవల ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా వార్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో నటించాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించలేకపోయింది. రిలీజ్ కి ముందు ఎంతో హైప్ ఉన్న సినిమా ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను నిరాశపరిచింది.(Naga Vamsi)

తెలుగులో ఈ సినిమాని నిర్మాత నాగవంశీ రిలీజ్ చేశారు. దాదాపు 90 కోట్లకు తెలుగు రైట్స్ కొని ఇక్కడ రిలీజ్ చేసారని సమాచారం. అయితే తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 సినిమా నష్టాలనే చూసింది. తాజాగా నాగవంశీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా వార్ 2 సినిమా ఫ్లాప్ అని మాట్లాడారు.

బాలీవుడ్ నిర్మాతలపై నమ్మకం, నష్టాలు

Also See : sridevi vijaykumar : ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. శ్రీదేవి దీపావళి ఫొటోస్.. ఫ్యామిలీతో సరదాగా..

రవితేజ మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వార్ 2 ప్రస్తావన రాగా నాగవంశీ మాట్లాడుతూ.. తప్పు జరిగింది. ఏం చెస్తాం చెప్పండి. నేనైనా, ఎన్టీఆర్ గారైనా ఆదిత్య చోప్రా అనే పెద్దమనిషిని, యష్ రాజ్ ఫిలిమ్స్ ని నమ్మాము. అందరూ తప్పులు చేస్తారు కదా. వాళ్ళ సైడ్ తప్పు జరిగింది. మనం దొరికాము అంతే. నేను తీసిన సినిమా కాదు కదా. ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, వాళ్ళని నమ్మాము. మిస్ ఫైర్ అయింది, ట్రోల్ చేసారు. కాకపోతే మనం చేసిన సినిమా కాకుండా బయట సినిమాతో దొరికాము దానికి హ్యాపీ అని అన్నారు. దీంతో నాగవంశీ ఇంత ఓపెన్ గా వార్ 2 సినిమా గురించి ఇలా మాట్లాడటంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఎన్టీఆర్, వార్ 2 తెలుగు హక్కులు

Also See : Allu Family : అల్లు ఫ్యామిలీ ఫొటో వైరల్.. ఎవరెవరు ఉన్నారంటే.. అల్లు శిరీష్ కి కాబోయే భార్యని చూశారా?

నాగవంశీ ఇంత ఓపెన్‌గా ‘వార్ 2’ ఫ్లాప్‌పై మాట్లాడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లను నమ్మి ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకోవడం అతని నిజాయితీకి నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.