
📌 Key Points
- నివేదా థామస్ లేటెస్ట్ ఫోటోలు వైరల్.. తమ్ముడితో కలిసి సందడి!
- ‘నిన్ను కోరి’ సినిమాతో నివేదాకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు
- సోషల్ మీడియాలో నివేదా ఫొటోలకు నెటిజన్ల నుండి భారీ రెస్పాన్స్
- ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులేవీ లేకున్నా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్
టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
నివేదా థామస్ లేటెస్ట్ పిక్స్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్(Niveda Thamos) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘పెద్ద మనిషి’(Pedda Manishi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది ‘నిన్ను కోరి’(Ninnu Kori) మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘జై లవకుశ’(Jai Lava Kusa), ‘వకీల్ సాబ్’(Vakeel Saab), ‘శాకిని డాకిని’(Shakini Dakini) వంటి సినిమాలతో హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ భామ ‘35 చిన్న కథ కాదు’ మూవీలో చాలా లావు అయి కనిపించింది.
అప్పట్లో స్లిమ్‌గా ఉండే ఈ చిన్నది ఒకేసారి లావు అయి కనిపించడంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌కు షాక్‌కు గురయ్యారు. అయితే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రజెంట్ ఈ భామ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్‌లు లేనట్టు కనిపిస్తుంది. దీంతో సోషల్ మీడియాకే పరిమితమైంది. అక్కడ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
తమ్ముడితో కలిసి నివేదా సందడి
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నివేదా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో తన తమ్ముడితో తీసుకున్న కొన్ని క్రేజీ ఫొటోలు పంచుకుంది. అతని షోల్డర్ పైన చేయి వేసి నవ్వుతూ, వెక్కిరిస్తూ ఉన్న పిక్స్‌ను షేర్ చేస్తూ.. ‘ది మెంటల్ బాయ్స్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతోఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సో గార్జియస్, క్యూట్ ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్ల కామెంట్స్.. క్యూట్ అంటూ ప్రశంసలు
A post shared by Nivetha Thomas (@i_nivethathomas)
నివేదా థామస్ తన తమ్ముడితో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు ఈ ఫోటోలను చూసి చాలా సంతోషిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


