|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల సునామీ! ఏ సినిమా రికార్డులు బద్దలు కొట్టిందో చూడండి!

Published: 22-01-2026, 6:35 AM
నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల సునామీ! ఏ సినిమా రికార్డులు బద్దలు కొట్టిందో చూడండి!
  • నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల హవా కొనసాగుతోంది.
  • ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ 4.5 కోట్లకు పైగా వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉంది.
  • లక్కీ భాస్కర్ 2.95 కోట్ల వ్యూస్‌తో రెండో స్థానంలో నిలిచింది.
  • పుష్ప 2, గుంటూరు కారం, సలార్ సినిమాలు కూడా టాప్ వ్యూస్ సాధించాయి.

ఓటీటీ వేదికల్లో తెలుగు సినిమాలు దూసుకుపోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తెలుగు చిత్రాలు భారీ వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, లక్కీ భాస్కర్ వంటి సినిమాలు టాప్ స్థానాల్లో నిలిచాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ తెలుగు సినిమాలు

Netflix Trending Movies: నేటి కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రేక్షకుల సినిమా చూసే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. థియేటర్‌కు వెళ్లకపోయినా, ఇంట్లో కూర్చొని కొత్త సినిమాలు చూడాలనే ఆసక్తి రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ మార్పులో తెలుగు సినిమాలు కూడా వెనుకబడలేదు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తెలుగు సినిమాలు భారీ సంఖ్యలో వ్యూస్ సాధిస్తూ దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు.. తెచ్చుకుంటున్నాయి. తాజాగా విడుదలైన నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన తెలుగు సినిమాల జాబితా తెలుగు ప్రేక్షకుల అభిరుచిని.. స్టార్ హీరోల క్రేజ్‌ను..అలాగే కంటెంట్‌కు ఉన్న బలాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

ఈ జాబితాలో మొదటి స్థానంలో ఆర్‌ఆర్‌ఆర్.. నిలిచింది. హిందీ వెర్షన్‌లో మాత్రమే ఉన్నప్పటికీ ఈ సినిమా 4 కోట్ల 50 లక్షలకుపైగా వ్యూస్ సాధించడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు సినిమాల స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

రెండో స్థానంలో లక్కీ భాస్కర్ ఉంది. ఈ సినిమా 2 కోట్ల 95 లక్షల వ్యూస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణ కథతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ఈ సినిమా నిరూపించింది. మూడో స్థానంలో హాయ్ నాన్న ఉంది. కుటుంబ భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రం 2 కోట్ల 10 లక్షల వ్యూస్ పొందింది.

రికార్డ్ వ్యూస్ సాధించిన చిత్రాలు

నాలుగో స్థానంలో పుష్ప 2 నిలిచింది. అల్లు అర్జున్ క్రేజ్ ఈ సినిమా వ్యూస్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఐదో స్థానంలో గుంటూరు కారం, ఆరవ స్థానంలో సలార్ హిందీ లేకుండా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏడో స్థానంలో దేవర, ఎనిమిదో స్థానంలో హిట్ 3, తొమ్మిదో స్థానంలో సరిపోదా శనివారం ఉన్నాయి. ఈ సినిమాలు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా మెప్పించాయి.

పదో స్థానంలో కల్కి 2898 ఏడీ (హిందీ మాత్రమే) నిలిచింది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా ఓటీటీలో మంచి ఆదరణ పొందింది. అలాగే కోర్టు, ఖుషి, దాకూ మహారాజ్, గాడ్‌ఫాదర్, కింగ్డమ్ వంటి సినిమాలు కూడా టాప్ లిస్ట్‌లో ఉన్నాయి.

జాబితా చివర్లో ఓజీ, భోళా శంకర్, దసరా, తండేల్, వాల్తేర్ వీరయ్య, బ్రో, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లక్షల సంఖ్యలో వ్యూస్ సాధించాయి.

ఓటీటీలో తెలుగు సినిమా సత్తా

మొత్తంగా చూస్తే,..ఈ జాబితా తెలుగు సినిమాల ఓటీటీ బలం ఎంత పెరిగిందో స్పష్టంగా చూపిస్తోంది. థియేటర్‌లో కాకుండా ఇంట్లో కూర్చొని చూసే ప్రేక్షకులు కూడా తెలుగు సినిమాలను విపరీతంగా ఆదరిస్తున్నారు.

మొత్తానికి, నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల హవా కొనసాగుతోంది. థియేటర్లతో సమానంగా ఓటీటీలో కూడా తెలుగు చిత్రాలకు ఆదరణ లభిస్తుండటం విశేషం. ఇది తెలుగు సినిమా పరిశ్రమకు శుభ సూచకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.