|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫిల్మ్ ఫేర్ పై నిహారిక ఫైర్! కొత్త వాళ్లకు అన్యాయమా? దుమ్ము రేపుతున్న మెగా డాటర్ కామెంట్స్!

Published: 23-02-2026, 2:35 AM
ఫిల్మ్ ఫేర్ పై నిహారిక ఫైర్! కొత్త వాళ్లకు అన్యాయమా? దుమ్ము రేపుతున్న మెగా డాటర్ కామెంట్స్!
  • ఫిల్మ్ ఫేర్ వేడుకలో కొత్త నటీనటులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై నిహారిక అసహనం!
  • నిర్వాహకుల తీరును తప్పుబడుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగా డాటర్ నిహారిక కొణిదెల.
  • తొలి అవార్డు ఎప్పుడూ ప్రత్యేకమే.. వారి కలను నిర్వాహకులు దూరం చేశారన్న నిహారిక.
  • నిహారిక పోస్ట్ వైరల్.. ఆమె గొప్ప మనసుపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

మెగా డాటర్ నిహారిక కొణిదెల మరోసారి వార్తల్లో నిలిచారు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల విషయంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు ఏం జరిగిందో చూద్దాం!

ఫిల్మ్ ఫేర్ నిర్వాహకులపై నిహారిక ఫైర్!

Niharika; మెగా డాటర్ నిహారిక కొణిదెల నెటిజన్స్ మనసులు గెలుచుకున్నారు. తాజాగా జరిగిన ఒక అవార్డు ఈవెంట్ లో నిర్వాకులు వ్యవహరించిన తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆ పాయింట్ ను లేవనెత్తుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దాంతో, ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అలాగే, ఆమె చేసిన కామెంట్స్ కి నెటిజన్స్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఇటీవల ఫిలిం ఫేర్ అవార్డుల ప్రధాన వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో అన్ని సినీ పరిశ్రమల నుంచి డెబ్యూటెంట్(నూతన పరిచయం) గా చాలా నటీనటులు అవార్డులు అందుకున్నారు. కానీ, వాళ్ళకి ఆ స్టేజిపై మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు నిర్వాహకులు. ఈ విషయాన్ని లేవనెత్తారు నిహారిక(Niharika).

నెట్టింట వైరల్ అవుతున్న నిహారిక పోస్ట్!

‘డెబ్యూ అవార్డు అనేది ప్రతీ ఆర్టిస్ట్ జీవితంలో చాలా ప్రత్యేకమైనది. అలాంటి సమయంలో వేదికపై నిలబడి రెండు మాటలు మాట్లాడటం అనేది వాళ్ళ జీవితకాల కల. కానీ, నిర్వాహకులు ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి అవార్డు వేడుకల్లో సమయ పరిమితులు ఉంటాయని నాకు కూడా తెలుసు. కానీ, మొదటిసారి అవార్డు అందుకున్న ఆర్టిస్టులకు అలాంటి స్టేజిపై మాట్లాడే అవకాశం కల్పిస్తే అది వాళ్ళ ప్రయాణానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది’ అంటూ రాసుకొచ్చింది నిహారిక.

నిహారికకు మద్దతుగా నెటిజన్స్ కామెంట్స్!

దీంతో నిహారిక చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అలాగే, ఏ విషయంలో ఆమెకు నెటిజన్స్ నుంచి సపోర్ట్ లభిస్తోంది. కమిటీ కుర్రోళ్ళు లాంటి సినిమాలు చేసి కొత్త వాళ్ళను పరిచయం చేయడమే కాదు, ఇలా వాళ్ల కోసం మీరు స్టాండ్ తీసుకోవడం చాలా గొప్ప విషయం. నిజంగా నిహారిక చాలా గ్రేట్ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కనీసరం నిహారిక చేసిన కామెంట్స్ ని పరిగణంలోకి తీసుకొని నెక్స్ట్ టైం అయినా వాళ్ళకి మాట్లాడే అవకాశాన్ని కలిపించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నిహారిక చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.