
నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 10 ఎపిసోడ్‌లో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. శాలిని కుట్రతో చంద్ర కింద పడటం, పూజకు ఆటంకం కలగడంతో జగదీశ్వరి కన్నీళ్లు పెట్టుకుంది. అత్త మనసు గెలుచుకునేందుకు చంద్ర ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరడం ఈ ఎపిసోడ్‌లో ప్రధానాకర్షణగా నిలిచింది.
Key Points
విరాట్-చంద్రకళ రొమాన్స్ చూసి శ్రుతి అసూయ, శ్యామల-కామాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాలిని కాలు అడ్డుపెట్టడంతో చంద్ర కింద పడి పూల దండ పాడై, పూజకు ఆటంకం కలిగింది.
పూజ చెడిపోయిందని జగదీశ్వరి కన్నీళ్లు పెట్టుకోగా, విరాట్ కూడా చంద్రను మందలించాడు.
అత్త జగదీశ్వరి కాళ్లు పట్టుకున్న చంద్ర, తన భవిష్యత్ మామయ్య చేతుల్లో ఉందని పూజ ఆపవద్దని కోరింది.
శాలిని కుట్ర, చంద్ర పతనం
నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళతో రొమాంటిక్ గా మాట్లాడతావు విరాట్. తన భార్యను పొగిడేస్తాడు. ఇద్దరు హగ్ చేసుకుంటారు. దుర్గాదేవి దయ వల్ల ప్రాబ్లెమ్స్ అన్ని తీరిపోతాయని విరాట్ అంటాడు. అది చూసిన శ్రుతి కుళ్లుతో రగిలిపోతుంది. శ్యామల నగలను చూస్తూ వేసుకుందామని ఆశగా చూస్తుంది కామాక్షి.
చంద్రకళ జడలో విరాట్ పువ్వు పెట్టిన విషయాన్ని శ్యామల, కామాక్షికి చెప్తుంది శ్రుతి. విరాట్ తో ఏకంగా కాపురమే చేస్తుందని కామాక్షి అంటుంది. ఈ మాటలు చంద్రకళ వింటుంది. చంద్ర కోసం విరాట్ పూలు తేవడం ఇది కొత్తేమీ కాదు. భార్యభర్తలను అడ్డుకునే హక్కు మనకు ఎక్కడ ఉంటుందని శ్యామల అంటుంది. నా మీద మీకు ప్రేమ ఉంది. ఐ లవ్యూ పిన్ని అని శ్యామల బుగ్గ గిల్లి ముద్దు పెట్టి వెళ్లిపోతుంది చంద్ర.
పూజకు ఆటంకం, జగదీశ్వరి ఆవేదన
దసరా రోజు చంద్రకు అర్జున్ ఫోన్ చేస్తాడు. బిజినెస్ ప్రాబ్లెమ్స్ కూడా సెట్ అవాలని అమ్మవారిని కోరుకోండని అర్జున్ అడుగుతాడు. అలా చంద్ర మాట్లాడుతూ వస్తుండగా శాలిని కాలు అడ్డం పెడుతుంది. చంద్ర కింద పడుతుంది. పూల దండ వెళ్లి చెప్పుల మీద పడుతుంది. ఎలా కిందపడ్డానో అర్థం కాలేదని చంద్ర చెప్తుంది. ఫ్లవర్ వాజ్ అయి ఉంటుందని శాలిని చెప్తుంది.
ఛాన్స్ దొరికిందని చంద్రకళ, విరాట్ ను మాటలంటారు శ్యామల , కామాక్షి. పండగ పూట రొమాన్స్ ఏంటని ఫైర్ అవుతుంది శ్యామల. పొరపాటున జరిగిందని ఇంకో మాల తీసుకొస్తానని అంటుంది చంద్ర. ఈ అమ్మాయి ఏదో చేస్తుందని, పూజలో ఏ అవాంతరం రావొద్దని ముందే చెప్పా. ఇలా జరిగితే వదిన మనసు ఎంతలా నొచ్చుకుంటుందని శ్యామల అంటుంది. జగదీశ్వరి ఏడుస్తూ వెళ్లిపోతుంది. విరాట్ కూడా చంద్రను జాగ్రత్తగా ఉండాల్సిందని అంటాడు.
అత్త కాళ్లు పట్టుకున్న చంద్ర
అత్తయ్య నన్ను క్షమించండి. పూల మాల కావాలని పడేయలేదు. పూజ చెడగొట్టాలనే ఉద్దేశం నాకు లేదని చంద్ర అంటుంది. నా బతుక్కి బాధే రాసి పెట్టాడు దేవుడు. ఎవరిని ఏం అనలేను వెళ్లు అని అంటుంది జగదీశ్వరి. ఇంకో మాల తీసుకొస్తాను పూజ చేయమంటుంది చంద్ర. ఎలా పూజ చేయగలను? అని అడుగుతుంది జగదీశ్వరి. నా భవిష్యత్ మామయ్య చేతుల్లో ఉంది ఈ పూజ ఆగిపోకూడదు. ప్లీజ్ అత్తయ్య అని కాళ్లు పట్టుకుంటుంది చంద్ర.
శ్యామల ఇంకో మాల తీసుకొచ్చి పూజ చేయమంటుంది. పూజ దగ్గరకు చంద్రను రావద్దని అంటుంది శ్యామల. జగదీశ్వరి, రఘురాం కలిసి పూజ చేస్తారు. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానంటూ భర్తను చూస్తూ బాధ పడుతుంది జగదీశ్వరి. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్‌లో శాలిని పన్నాగం, చంద్ర పడ్డ కష్టాలు, అత్తగారిపై ఆమెకు ఉన్న గౌరవం స్పష్టంగా కనిపించాయి. పూజ ఆటంకం, జగదీశ్వరి బాధ ప్రేక్షకుల మనసులను కదిలించాయి. ఈ డ్రామా తదుపరి ఎపిసోడ్‌లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.


