
నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 26 ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. పికిల్స్ డ్యామేజ్ వెనుక శ్రీధర్ ఉన్నాడని అర్జున్ తెలుసుకున్నాడు. విరాట్ చంద్రపై కోప్పడగా, శ్యామల ఇంటి నుండి వెళ్లిపోతుండగా చంద్ర ఆమెకు ఛాలెంజ్ విసిరింది. పూర్తి వివరాలు ఇక్కడ.
Key Points
పికిల్స్ పాడవడానికి శ్రీధర్ కారణమని సీసీటీవీ ఫుటేజీ ద్వారా అర్జున్ కనుగొన్నాడు.
శ్రుతిని కొట్టినందుకు చంద్రపై విరాట్ మండిపడి ఆమెను మందలించాడు.
శ్యామల ఇంట్లో నుంచి వెళ్లిపోతుండగా, చంద్ర ఆమెను ఆపి సవాల్ విసిరింది.
శత్రువు కూతురు కాదని నిరూపించుకోవాలని లేదా నిజం తేలేదాకా ఉండాలని శ్యామలకు చంద్ర ఛాలెంజ్.
శ్రీధర్‌ను నిలదీసిన అర్జున్
నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 26వ తేదీ ఎపిసోడ్ లో పచ్చళ్లలో నీళ్లు కలిపావ్ కదా అని శ్రీధర్ తో అంటాడు అర్జున్. ఎందుకా పని చేశావ్? నేను సీసీటీవీ ఫుటేజీ చెక్ చేశా. నువ్వే కదా పచ్చళ్లు చెడగొట్టే ప్లాన్ వేశావని అర్జున్ అడుగుతాడు. నేను ఏ డ్యామేజీ చేయలేదని శ్రీధర్ నాటకమాడతాడు. అర్జున్ డోర్ క్లోస్ చేసి వచ్చి బెల్ట్ తో శ్రీధర్ ను చితకబాదుతాడు. నేనే చేశా సర్ అని ఒప్పుకొంటాడు శ్రీధర్.
విరాట్ రాగానే హగ్ చేసుకుని ఏడుస్తుంది శ్రుతి. మీ ఆవిడ కొట్టిందని చెప్తుంది. నీ సపోర్ట్ చూసుకుని చంద్రకళ రెచ్చిపోతుంది. పెద్దమ్మ మీదకు తిరగబడిందని లేని పోనివి అన్ని చెప్తుంది శ్రుతి. శ్రుతిని ఎందుకు కొట్టావని చంద్రను అడుగుతాడు విరాట్ . నువ్వు చెయ్యి ఎత్తడం తప్పు చంద్ర. వాళ్లకు అవకాశం ఇచ్చేలా నువ్వు ప్రవర్తిస్తూనే ఉంటావు. మళ్లీ గొడవకు కారణమయ్యావని విరాట్ మండిపడతాడు.
చంద్రపై విరాట్ ఆగ్రహం
అప్పుడే చంద్రకు అర్జున్ ఫోన్ చేసి పికిల్స్ పాడవడానికి కారణం మన స్టాఫ్ శ్రీధర్ అని చెప్తాడు. నేను ఇప్పుడే వస్తున్నానని అంటుంది చంద్ర. ఇంతలో శ్యామల లగేజీ తీసుకుని నిన్ను గెలవలేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని శ్యామల అంటుంది. మొదటి సారి ఈ శ్యామల ఒకరి ముందు ఓడిపోయిందని అంటుంది. శ్యామల ఊరు వెళ్తొంది విరాట్ అని కామాక్షి అంటుంది.
నా కన్నా శత్రువు కూతురే ఎక్కువైంది మీ అందరికీ. ముమ్మాటికి నువ్వు శత్రువువే. అయినా నిన్ను అనడానికి నాకు ఏం హక్కు ఉందని శ్యామల కోప్పడుతుంది. నీకు అన్ని హక్కులున్నాయి. మీ అన్నయ్యకు ఎంత విలువ ఉందో నీకు అంతే ఉంది మనసులో అని జగదీశ్వరి అంటే, ఏం లేదని అంటుంది శ్యామల. అలా అన్నవాళ్ల చెంప పగలగొడతానని జగదీశ్వరి, కామాక్షి ఇది నీ పనేనా అని అడుగుతుంది. ఎవరో చెప్తే కానీ తెలుసుకోలేని అమాయకురాలిని కాదు వదిన. చంద్రను నెత్తిన పెట్టి ఊరేగిస్తున్నారని శ్యామల అంటుంది.
శ్యామలకు చంద్ర సవాల్
మీరు వెళ్లడానికి నేను ఒప్పుకోను. మీరు ఉండాల్సిన అవసరం ఉంది పిన్ని అని శ్యామల అంటుంది. శ్యామలకు జగదీశ్వరి సారీ చెప్తే వద్దంటుంది. వెళ్లిపోతున్న శ్యామలను ఆపి మీరు ఓటమిని ఒప్పుకొని వెళ్లినా నేను గెలిచానని అనుకోవడం లేదు. నేను శత్రువు కూతురు అని ప్రూవ్ చేసి వెళ్లండి లేదా అబద్దమని నేను ప్రూవ్ చేసేదాకి అయినా ఉండండి. నాదే తప్పు అని ప్రూవ్ అయిన రోజు నాకు సపోర్ట్ ఉండదు. నా తప్పు లేకపోతే మీరు చూపించే ప్రేమ కూడా నాకు కావాలని చంద్రకళ అంటుంది.
నేను ఓడిపోతే వెళ్లిపోతా. చేసిన ఛాలెంజ్ పూర్తి చేద్దామని అంటుంది చంద్ర. మీ అన్నయ్య కోలుకుని శ్యామల ఎక్కడంటే ఏం చెప్పాలని జగదీశ్వరి ప్రశ్నిస్తుంది. దయచేసి ఉండిపొమ్మని అనగానే శ్యామల సరే అంటుంది. మరోవైపు శాలిని చెప్తేనే డబ్బు కోసం ఇలా చేశానని అర్జున్ తో శ్రీధర్ చెప్పేయడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈరోజు నిన్ను కోరి ఎపిసోడ్‌లో అర్జున్ నిజం తెలుసుకోవడం, విరాట్ చంద్ర మధ్య గొడవలు, శ్యామలకు చంద్ర సవాల్ ఎపిసోడ్‌ను మరింత రసవత్తరంగా మార్చాయి. తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.


