
టాలీవుడ్ నటుడు నితిన్, శ్రీరామ్ వేణు కాంబోలో తెరకెక్కుతున్న ‘తమ్ముడు’ చిత్రం జూలై 4న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘జై భగలముఖి’ పాటను విడుదల చేశారు. ఈ పాట లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Key Points
నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా నుంచి ‘జై భగలముఖి’ సాంగ్ రిలీజ్.
ఈ పాట లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన చిత్రం ఇది.
‘తమ్ముడు’ సినిమా విడుదల తేదీ
టాలీవుడ్ హీరో నితిన్(Nithin), శ్రీరామ్ వేణు(Sriram) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’(Thammudu). దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజ్(Dil Raju) నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సప్తమి గౌడ(Sapathami Gowda) హీరోయిన్‌గా నటిస్తుండగా.. లయ(Laya), స్వశిక(Swashika), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), సౌరభ్ సచ్‌దేవా(Sourab Sachdev) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 4న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీమ్ వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలోని సెకెండ్ సింగిల్ అయినటువంటి ‘జై భగలముఖి’(Jai Bagalamukhi) సాంగ్ రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ పాటలోని లిరీక్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటను ఓ సారి వినేయండి. Link
‘జై భగలముఖి’ సాంగ్ రిలీజ్
సినిమా ప్రమోషన్స్
‘జై భగలముఖి’ పాటతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. జూలై 4న విడుదల కానున్న ‘తమ్ముడు’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.


