
📌 Key Points
- ఎన్టీఆర్-నీల్ సినిమా షూటింగ్‍కు బ్రేక్, అభిమానుల్లో నిరాశ!
- జోర్డాన్‍లో షూటింగ్‍కు అడ్డంకులు, ఆర్టిస్టులు, లాజిస్టిక్స్ సమస్యలు!
- రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి షూటింగ్ రీస్టార్ట్ చేయాలని ప్లాన్!
- జూన్ 25న విడుదల అవుతుందా? రిలీజ్ డేట్ పై అనుమానాలు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం డ్రాగన్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
జోర్డాన్ లో షూటింగ్ కు ఆటంకాలు!
NTR : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రస్తుతం డ్రాగన్ సినిమా భారీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ షూటింగ్ మాత్రం నిదానంగా సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలు కారణాలతో మధ్యలో వాయిదాలు పడింది. తాజాగా మరోసారి ఈ సినిమా షూటింగ్ కి ఇబ్బంది రావడంతో ఆపేశారట.(NTR)
ఎన్టీఆర్ – నీల్ సినిమా షూటింగ్ జోర్డాన్ దేశంలో జరుగుతుంది. అక్కడ భారీ యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతుంది. మార్చ్ 6 వరకు ఈ సినిమా షూటింగ్ జరగాలి. అనుకున్నట్టు యాక్షన్ సీన్స్ అయితే షూట్ చేశారట కానీ ఈ సీక్వెన్స్ లకు సంబంధించిన కొన్ని కనెక్టింగ్ సీన్స్ లో అడ్డంకులు వచ్చాయట. జోర్డాన్ లో స్థానికంగా సరైన జూనియర్ ఆర్టిస్టులు లేకపోవడం, లాజిస్టిక్స్ సమస్యలు తలెత్తడంతో ప్రస్తుతానికి షూటింగ్ ఆపేశారట.
రామోజీ ఫిలిం సిటీలో నెక్స్ట్ షెడ్యూల్!
తిరిగి మూవీ యూనిట్ రిటన్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చాక రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి మిగిలిన సీన్స్ ని షూట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారట. దీంతో మరోసారి ఎన్టీఆర్ – నీల్ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. గతంలో స్క్రిప్ట్ సమస్యలు వచ్చి, మరోసారి ఎన్టీఆర్ కి గాయాలు అయి, మరోసారి వేరే సమస్యలతో ఇలా పలుమార్లు ఎన్టీఆర్ – నీల్ సినిమా షూటింగ్ ఆగిపోతూ వస్తుంది.
రిలీజ్ డేట్ పై సందిగ్ధత!
ఈ సంవత్సరం జూన్ 25న డ్రాగన్ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మరి చెప్పినట్టు ఆ సమయానికి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి రిలీజ్ చేస్తారా లేదా మళ్ళీ వాయిదా వేస్తారా చూడాలి.
మొత్తానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ మళ్ళీ ఆగిపోయింది. రిలీజ్ డేట్ కి సినిమా వస్తుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


