|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్-నీల్ మూవీలో ఊహించని మార్పు! టోవినో అవుట్, బాలీవుడ్ స్టార్ ఇన్! షాక్ తిన్న ఫ్యాన్స్!

Published: 11-04-2026, 11:05 AM
ఎన్టీఆర్-నీల్ మూవీలో ఊహించని మార్పు! టోవినో అవుట్, బాలీవుడ్ స్టార్ ఇన్! షాక్ తిన్న ఫ్యాన్స్!
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
  • టోవినో థామస్ వ్యక్తిగత కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకున్నారు.
  • టోవినో స్థానంలో షాహిద్ కపూర్ నటించే అవకాశం ఉంది.
  • మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే, ఈ సినిమాలో నటిస్తున్న టోవినో థామస్ కొన్ని కారణాల వల్ల తప్పుకోవడంతో ఇప్పుడు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు.

టోవినో థామస్ ఎందుకు తప్పుకున్నారు?

Jr.NTR -Neel: టాలీవుడ్ స్టార్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. సుమారు 40% వరకు షూటింగ్ పనులు జరుపుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమా గత ఏడాది షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ ఇప్పటివరకు కేవలం 40% షూటింగ్ మాత్రమే జరిగింది అంటే అభిమానులు కూడా కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ప్రకటించబోతున్నట్టు సమాచారం.

మే 20 వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ తో పాటు, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది . ఇదిలా ఉండగా ఈ సినిమాలో పలువురు నటీనటులు బాగమవుతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కుష్బూ అనిల్ కపూర్ వంటి వారు నటించబోతున్నారని తెలుస్తుంది .కానీ ఇప్పటివరకు అధికారక ప్రకటన మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో టోవినో థామస్ (Tovino Thomas) నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు. అయితే ఇటీవల ఒక సినిమా వేడుకలో భాగంగా టోవినో థామస్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలిపారు.

షాహిద్ కపూర్ ఎంట్రీ నిజమేనా?

తన వ్యక్తిగత కారణాలు అలాగే డేట్స్ అడ్జస్ట్ కానీ నేపథ్యంలో తాను ఈ సినిమా నుంచి తప్పుకున్నానని ఈయన క్లారిటీ ఇచ్చారు. ఇలా టోవినో థామస్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో మరెవరు నటించబోతున్నారనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.ఈ నేపథ్యంలోనే పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో షాహిద్ కపూర్ (ShahidKapoor) ఒకరు. ప్రస్తుతం చిత్ర బృందం షాహిద్ కపూర్ తో చర్చలు జరుపుతున్నారని టోవినో థామస్ స్థానంలో షాహిద్ కపూర్ ను తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. షాహిద్ కపూర్ కథ విన్న తర్వాత కాస్త సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్…

సినిమా షూటింగ్ అప్డేట్స్

ఇక ఈ సినిమాలో టోవినో థామస్ స్థానంలో షాహిద్ కపూర్ నటించబోతున్నారా? లేదా అనేది తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ జోడిగా నటి రుక్మిణి వసంత్(Rukmini Vasanth) నటించబోతున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలకపాత్రలో నటిస్తున్నారని నటి కుష్బూ కూడా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వీటన్నిటి పట్ల స్పష్టత రావాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

మొత్తానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టోవినో తప్పుకోవడంతో షాహిద్ కపూర్ వస్తాడా లేదా అనేది చూడాలి. మే 20న మరిన్ని వివరాలు తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.