|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై సంచలన నిజాలు! ఆప్తమిత్రుడు చెప్పిన షాకింగ్ విషయాలు!

Published: 20-05-2026, 4:45 PM
ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై సంచలన నిజాలు! ఆప్తమిత్రుడు చెప్పిన షాకింగ్ విషయాలు!
  • ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఆప్తమిత్రుడు రఘు కారుమంచి కీలక వ్యాఖ్యలు చేశారు.
  • తారక్ ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నారని, సినిమాలు చేయాలని రఘు సూచించారు.
  • విజయ్ తో పోల్చడం సరికాదని, ఎన్టీఆర్ స్థాయి వేరని రఘు అభిప్రాయపడ్డారు.
  • భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తారని రఘు ధీమా వ్యక్తం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఆయన ఆప్తమిత్రుడు, కమెడియన్ రఘు కారుమంచి క్లారిటీ ఇచ్చారు. తారక్ ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నారని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే మాత్రం చరిత్ర సృష్టిస్తారని రఘు అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఆప్తమిత్రుడి వ్యాఖ్యలు

NTR Politics : విజయ్ సినీ ఇండస్ట్రీ నుండి పాలిటిక్స్ లోకి వెళ్లి సీయం అవడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా సీయం అయితే బాగుండు అంటూ గత కొన్ని రోజులుగా తెగ డిబేట్లు పెట్టేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఇక ఈరోజు తారక్ బర్త్ డే అవడంతో ఈ డిబెట్లకి మరింత పదును పెట్టేస్తున్నారు అభిమానులు.నిన్న రాత్రి తారక్ ఇంటి వద్ద, అలాగే ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ గ్లింప్స్ లాంచ్ సందర్భంగా కూడా అభిమానులు ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేశారు కూడా.ఇక ఇదిలా ఉంటె తారక్ పొలిటికల్ ఎంట్రీపై తారక్ ఆప్త మిత్రుడు కమెడియన్ రఘు కారుమంచి (రోలర్ రఘు) చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు

రఘు మాట్లాడుతూ “ఎవరో సీఎం అయ్యారని, వారిని చూసి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం అంటే ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు’ అవుతుంది. ఎన్టీఆర్ స్థాయి వేరు. విజయ్ 35 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం, దాదాపు 69 చిత్రాల తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ తారక్ ఇప్పుడు కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు. ఆయన్ను ఇప్పుడు ప్రశాంతంగా సినిమాలు చేసుకోనివ్వాలి” అని మనసులోని మాటని బయటపెట్టాడు ఈ క్రేజీ కమెడియన్.

విజయ్ తో పోలిక, తారక్ కెరీర్ పీక్

తారక్ పాలిటిక్స్ లోకి వస్తే  హిస్టరీ ఖాయం

అయితే ఫ్యూచర్ లో తారక్ పాలిటిక్స్ లోకి వస్తే మాత్రం హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం అంటూ రఘు కాన్ఫిడెంట్ గా చెప్పడం విశేషం. విజయ్ తర్వాత ఆ స్థాయిలో జనాల్లోకి వెళ్ళే క్రేజ్, రాజకీయాల్లో సంచలనం సృష్టించే సామర్థ్యం ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్ అని ఆకాశానికి ఎత్తేశాడు రఘు.అయితే, తారక్ ఎప్పుడు రావాలి? ఏ పార్టీ తరపున రావాలి? లేదా సొంతంగా పార్టీ పెడతారా? అనే అంశాలపై అప్పుడే జడ్జిమెంట్స్ ఇవ్వడం సరికాదని సూచించాడు. “నేను కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటాను, కానీ అది ఒక పద్ధతి ప్రకారం జరగాలి” అని ఆయన అసలు విషయం చెప్పుకొచ్చాడు.

ఇద్దరి మధ్య బాండింగ్ చూస్తే

భవిష్యత్తులో చరిత్ర సృష్టిస్తాడు: రఘు

ఇక తారక్ కి రఘు కారుమంచికి మధ్య బాండింగ్ చూస్తే అదొక ఎమోషనల్ బాండింగ్ అని చెప్పొచ్చు. 2002లో వచ్చిన ‘ఆది’ చిత్రం నుండి వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ మొదలైంది.”ఎన్టీఆర్ నా జీవితంలో ఒక భాగం. నా ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండె ఎలాగో ఎన్టీఆర్ కూడా నాకు అలానే. ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను” అని చెప్పడం,తారక్‌ను ఆయన అన్నగా, పెద్దన్నగా, నాన్న అని పిలుచుకోవడం బట్టి ఆయనకు తారక్ పై ఎంత ప్రేమో అర్థం అవుతుంది.

ఎన్టీఆర్ విషయానికొస్తే, తన 20 ఏళ్ల కెరీర్‌లో ‘ఆది’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’, ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఎన్టీఆర్ రాజకీయ నిర్ణయం ఏదైనా, ప్రస్తుతానికి ఆయన సినీ ఇండస్ట్రీలో ఒక గ్లోబల్ పవర్‌హౌస్‌గా దూసుకుపోతున్నాడు. చూడాలి మరి ముందు ముందు అయినా విజయ్ లా తారక్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సీయం అవుతాడో లేదో !

మొత్తానికి, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై అభిమానుల ఆశలు సజీవంగానే ఉన్నాయని, అయితే అది సరైన సమయంలో, సరైన పద్ధతిలో జరగాలని రఘు కారుమంచి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో తారక్ నిర్ణయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.