
📌 Key Points
- ఎన్టీఆర్ ‘దండోరా’ సినిమా చూసి ప్రశంసలు, మూవీ టీమ్ పై ప్రశంసల వర్షం!
- శివాజీ, నవదీప్, నందు, రవి కృష్ణ, బిందు మాధవి నటన అద్భుతం అన్నారు ఎన్టీఆర్.
- మురళీ కాంత్ దర్శకత్వం, రవీంద్ర బెనర్జీ గారి మద్దతుకి ఎన్టీఆర్ అభినందనలు.
- దండోరా సినిమాపై ఎన్టీఆర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్ లో సెన్సేషన్! ఎన్టీఆర్ లేటెస్ట్ గా ‘దండోరా’ సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆయన ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు! పూర్తి వివరాల్లోకి వెళ్దాం.
దండోరా చిత్రంపై ఎన్టీఆర్ ప్రశంసలు
Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన సినిమా ‘దండోరా’. క్రిస్మస్ సందర్బంగా డిసెంబర్ 25న ఈ సినిమా విడుదుల అయ్యింది. ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. కానీ, అదే రోజు మరో మూడు సినిమాకు కూడా విడుదల అవడంతో ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ, చాలా మంది ప్రముఖుల నుంచి ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి.
నటీనటుల గురించి ఎన్టీఆర్ కామెంట్స్
తాజాగా గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) కూడా దండోరా సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. “ఇప్పుడే ‘దండోరా’ సినిమా చూశాను. ఇది ఆలోచింపజేసే, శక్తివంతమైన సినిమా. శివాజీ గారు, నవదీప్, నందు, రవి కృష్ణ, బిందు మాధవి అద్భుతమైన నటనను కనబరిచారు. ఇంతటి బలమైన, రూటెడ్ కథను ఇంత బాగా రూపొందించినందుకు దర్శకుడు మురళీ కాంత్ గారికి నా అభినందనలు.
వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ట్వీట్
ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చి, ముందుకు నడిపించినందుకు రవీంద్ర బెనర్జీ గారికి అభినందనలు. ఇంత అద్భుతమైన చిత్రానికి సపోర్ట్ గా ఉన్నందుకు, అందులో భాగమైనందుకు సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు” అంటూ రాసుకొచ్చాడు ఎన్టీఆర్. దీంతో, ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అలాగే తమ సినిమాపై ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పోస్ట్ చేయడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ ‘దండోరా’ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


