|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలుగమ్మాయిలకు 20 శాతమే.. ఇంత కష్టం ఎక్కడా లేదు : అనన్య నాగళ్ల

Published: 22-06-2025, 5:49 AM
తెలుగమ్మాయిలకు 20 శాతమే.. ఇంత కష్టం ఎక్కడా లేదు : అనన్య నాగళ్ల

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు చాలా తక్కువని యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో వారికి ఎదురయ్యే సవాళ్లు, పోటీ గురించి ఆమె వివరించారు. పొట్టేల్ సినిమాకు ఆమెకు వచ్చిన అవార్డు గురించి కూడా ఆమె మాట్లాడారు.

Key Points

1

టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు అవకాశాలు కేవలం 20 శాతం మాత్రమే.

2

అనన్య నాగళ్ల, తెలుగు హీరోయిన్లకు ఎదురయ్యే కష్టాలను వెల్లడించారు.

4

తెలుగు అమ్మాయిల మానసిక బలం గురించి ఆమె ప్రశంసించారు.

టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల పరిస్థితి

టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు అవకాశాలు చాలా తక్కువ అనే కంప్లైంట్‌ ఎప్పటి నుంచో ఉంది. ఇది ఇప్పటికీ కొనసాగుతుందని చెబుతోంది యంగ్‌ హీరోయిన్‌ అనన్య నాగళ్ల(Ananya Nagalla). టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు 20 శాతం మాత్రమే అవకాశాలు వస్తాయని..దాని కోసమే పదేళ్లు కొట్టుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాజాగా  ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో  వివరించింది.

‘తెలుగు అమ్మాయిలను చూస్తే గర్వంగా అనిపిస్తుంది. ఇండియాలో ఏ లాంగ్వేజ్‌ అమ్మాయికి అయినా ఇంత కష్టం ఉండదేమో. తెలుగులో మన వాళ్లకు 20 శాతం మాత్రమే అవకాశం ఉంటుంది. వందలో 80 సినిమాలకు పరభాష హీరోయిన్లనే తీసుకుంటారు. అదే మలయాళం, తమిళ్‌ తో పాటు ఇతర భాషల్లో చూస్తే..అక్కడ లోకల్‌ అమ్మాయిలకే 80 శాతం అవకాశం ఇస్తారు. ఇలా ఎక్కడ చూసిన తెలుగు అమ్మాయిలకు 20 శాతం మాత్రమే చాన్స్‌ ఉంటుంది. ఇందులోనే తమ టాలెంట్‌ని నిరూపించుకోవాలి.

అనన్య నాగళ్ల అనుభవాలు

చిన్నప్పటి నంచి సినిమాలు చూసి ఇష్టం పెంచుకొని, పెరెంట్స్‌ ఒప్పించి ఇండస్ట్రీలోకి వస్తే.. ఈ 20 శాతం కోసమే పదేళ్లు కొట్టుకోవాలి. మిగతావాళ్లకి లోకల్‌తో పాటు మన దగ్గర కూడా 80 శాతం అవకాశాలు ఉంటాయి. అందుకే నాకు తెలుగు అమ్మాయిలను చూస్తే గర్వంగా ఉంటుంది. వాళ్లు మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు’ అని అనన్య చెప్పుకొచ్చింది.

ఇక ఇదే ఇంటర్వ్యూలో పొట్టేల్‌ సినిమాకు గాను  తనకు వచ్చిన స్పెషల్‌ జ్యూరీ గద్దర్‌ అవార్డు గురించి మాట్లాడుతూ..  ఇలాంటి అవార్డు తనకు వస్తుందని అసలు ఊహించలేదని చెప్పింది. ‘అవార్డులు ప్రకటించిన రోజు నా మూడ్‌ బాగోలేదు. ఇంట్లో పడుకొని ఉన్నాను. లేవగానే.. పాజిటివ్‌ విషయం గురించి థింక్‌ చేస్తూ.. ఏదైనా అవార్డు వస్తే బాగుండు అనుకున్నాను. అయితే ఆ రోజు గద్దర్‌ అవార్డులు ప్రకటిస్తారనే విషయం కూడా నాకు తెలియదు.

పొట్టేల్ అవార్డు గురించి

బెడ్‌ రూం నుంచి హాల్‌లోకి రాగానే.. టీవీలో గద్దర్‌ అవార్డుల ప్రకటన న్యూస్‌ చూస్తూ.. ‘ఇంత మంచి సినిమాలు చేస్తున్నా..నాక్కుడా వస్తే బాగుండు’ కదా అని అన్నయ్యతో చెబుతున్నా..అంతలోనే నాకు పొట్టేల్‌ మూవీ నిర్మాత ఫోన్‌ చేసి‘మన సినిమాకు అవార్డు వచ్చింది’ అని చెప్పగానే షాక్‌ అయ్యాను. ఆరేళ్ల కెరీర్‌లో మీడియాతో పాటు ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్‌ చేశారు. అందుకే నేను ఇప్పుడు  ఈ స్థాయిలో ఉన్నాను’ అని అనన్య చెప్పుకొచ్చింది

అనన్య నాగళ్ల తెలుగు హీరోయిన్ల పట్ల ఉన్న సవాళ్లను, వారి మానసిక బలాన్ని ప్రస్తావించారు. పొట్టేల్ సినిమాకు అవార్డు లభించడం ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.