
📌 Key Points
- ఓర్మాక్స్ 2026 నివేదికలో ప్రభాస్ దేశంలోనే నంబర్ 1 స్టార్‌గా నిలిచారు.
- టాప్ 10లో ఐదు స్థానాలను తెలుగు హీరోలు కైవసం చేసుకుని బాలీవుడ్‌కు షాకిచ్చారు.
- షారూఖ్ ఖాన్ 2వ స్థానంలో ఉండగా, అల్లు అర్జున్ 3వ స్థానాన్ని దక్కించుకున్నారు.
- ‘బాహుబలి’ నుండి ‘కల్కి 2898 AD’ వరకు ప్రభాస్ క్రేజ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన తాజా నివేదిక సినీ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ‘ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్’ ఏప్రిల్ 2026 రిపోర్ట్ ప్రకారం, రెబల్ స్టార్ ప్రభాస్ దేశంలోనే నంబర్ 1 స్టార్‌గా నిలిచి, టాలీవుడ్ సత్తాను చాటారు. బాలీవుడ్‌కు ఇది షాకింగ్ న్యూస్.
ఓర్మాక్స్ రిపోర్ట్: టాలీవుడ్ హవా
Tollywood Dominance: ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానా అనే వారు.కానీ కాలం మారింది.ఇప్పుడు సౌత్ సినిమా.. ముఖ్యంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలైన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసిన ‘ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్’ ఏప్రిల్ 2026 నివేదిక నేషనల్ వైడ్ గా ఫిలిం సర్కిల్స్ లో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా నంబర్ వన్
ఈ లేటెస్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 మేల్ సినీ స్టార్స్ జాబితాలో టాలీవుడ్ హీరోల హవా స్పష్టంగా కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా మొత్తం పది స్థానాలలో ఏకంగా ఐదు స్థానాలను తెలుగు హీరోలే కైవసం చేసుకోవడం ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ కి సైతం మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా నంబర్ వన్ స్పాట్‌ను కైవసం చేసుకుని తన తిరుగులేని క్రేజ్‌ను మరోసారి నిరూపించుకున్నారు. ‘బాహుబలి’ సిరీస్ తో మొదలైన ప్రభాస్ మేనియా రీసెంట్ గా వచ్చిన ‘కల్కి 2898 AD’ మరియు ‘సలార్’ చిత్రాలతో మరింత పీక్స్ కు చేరింది. రాబోయే రోజుల్లో ఆయన నటిస్తున్న స్పిరిట్ ,ఫౌజి చిత్రాలు బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేయబోతున్నాయో ఈ క్రేజ్ చూస్తేనే అర్థమవుతోంది.
Ormax Stars India Loves: Most popular male film stars in India (Apr 2026) #OrmaxSIL pic.twitter.com/S8RMt7kfrc
— Ormax Media (@OrmaxMedia) May 21, 2026
ప్రభాస్ నంబర్ 1 స్థానం: తిరుగులేని క్రేజ్
ఉత్తరాది పరువును కాపాడిన షారూక్
ప్రభాస్ తర్వాత ఈ లిస్టులో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ రెండవ స్థానంలో నిలిచి ఉత్తరాది పరువును కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఆయనకు గట్టి పోటీ ఇస్తూ.. తన అద్భుతమైన నటన, స్వాగ్‌తో పుష్పరాజ్‌గా యావత్ దేశాన్ని ఊపేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూడవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో మనకు తెలిసిందే. ఇప్పుడు మోస్ట్ అవేటెడ్ రాకా తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి రెడీ అవుతున్న ఈ సమయంలో అల్లు అర్జున్ టాప్ 3 గా నిలవడం మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది.
సౌత్, నార్త్ మధ్య ఫుల్ కాంపిటీషన్
ఇక తమిళ పరిశ్రమ నుండి దళపతి విజయ్ నాల్గవ స్థానాన్ని సొంతం చేసుకుని కోలీవుడ్‌లో తనకు తిరుగులేదని చాటుకున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఐదవ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఇక బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్ ఆరవ స్థానంలో నిలవగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏడవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ‘RRR’ సినిమాతో అస్కార్ వేదిక వరకు వెళ్లిన రామ్ చరణ్, ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాతో జూన్ 4న పలకరించనున్నాడు.ఒకసారి గనుక ఈ లిస్టు ని గమనిస్తే సౌత్, నార్త్ మధ్య కాంపిటీషన్ గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తుంది.
అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్ స్థానాలు
పదో స్థానాన్ని సొంతం చేసుకున్న తారక్
ఇక ఈ జాబితాలోని చివరి మూడు స్థానాలలో చూస్తె బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్ ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకోగా, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తొమ్మిదవ స్థానంలో నిలిచారు. అలాగే టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. తారక్, ప్రస్తుతం డ్రాగన్ లో నటిస్తూ తన సత్తా ఏంటో మరోసారి చాటి చెప్పేందుకు రెడీ అవుతున్నాడు.
మొత్తంగా ఈ ఏప్రిల్ 2026 రిపోర్ట్ లో సగానికి పైగా తెలుగు హీరోలదే డామినేషన్ ఉండటం గమనార్హం. మరి ముందు ముందు మరికొన్ని భారీ పాన్ ఇండియా చిత్రాలు థియేటర్లలోకి రానుండగా.. ఈ ర్యాంకింగ్స్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయో వేచి చూడాలి.
మొత్తంగా, ఓర్మాక్స్ నివేదిక టాలీవుడ్ ఎదుగుదలను, పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హీరోల ప్రభావాన్ని స్పష్టంగా చూపింది. ఇది భారతీయ సినిమా భవిష్యత్తులో సౌత్ సినిమా పాత్ర ఎంత కీలకమో తెలియజేస్తుంది.


