|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్ వ్యూహం మార్పు! సురేందర్ రెడ్డితో పక్కా ప్లాన్?

Published: 14-04-2026, 6:05 AM
ఉస్తాద్ ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్ వ్యూహం మార్పు! సురేందర్ రెడ్డితో పక్కా ప్లాన్?
  • ఉస్తాద్ భగత్ సింగ్ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహం
  • సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేయాలని ఆదేశం
  • అమరావతిలో ప్రత్యేక ఆఫీస్‌లో స్క్రిప్ట్ పనులు
  • ఓజీ 2 సీక్వెల్ పై కూడా దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆయన తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సురేందర్ రెడ్డితో చేయబోయే సినిమా స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు.

ఉస్తాద్ దెబ్బ: పవన్ కళ్యాణ్ ప్లాన్ మార్పు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నా టైమ్ కేటాయించి చేసిన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లలో ‘ఓజీ’ తప్ప మిగిలిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా ‘ఓజీ’ సూపర్ హిట్ అవ్వడంతో, ఆ తర్వాత వచ్చిన ‘ఉస్తాద్’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో మెగా ఫ్యాన్స్ వందల కోట్ల వసూళ్లు ఖాయమని భావించారు. కానీ, విడుదలైన మొదటి రోజే సినిమా భవిష్యత్తు ఏంటో క్లియర్ కట్ పిక్చర్ వచ్చేసింది. వందల కోట్లు అటుంచి, కనీసం వంద కోట్లు కూడా రాబట్టలేకపోయిందంటే హరీష్ శంకర్ సినిమాను ఎలా తీశాడో అర్థమవుతుంది. ఇలా ఊహించని షాక్ తగలడంతో ఈసారి పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు పవన్ కల్యాణ్. సినిమా మొదలవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో స్క్రిప్ట్ పూర్తవ్వాల్సిందేనని సురేందర్ రెడ్డికి హుకుం జారీ చేశాడు.

అప్పుడెప్పుడో సినిమా ఉంటుందని అనౌన్స్ చేసినా ఇప్పటి వరకు పట్టాలెక్కకపోవడానికి కారణం కథ పూర్తిగా రెడీ కాకపోవడమే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా స్టోరీని చకచక కంప్లీట్ చేయాలంటూ ఏకంగా అమరావతిలోనే ఒక ప్రత్యేక ఆఫీస్‌ను ఓపెన్ చేశారట. డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రైటర్ వక్కంతం వంశీ ప్రస్తుతం అక్కడే మకాం వేసి స్క్రిప్ట్ పనులు చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌లో ఏమాత్రం గ్యాప్ దొరికినా ఆ ఆఫీస్‌లో వాలిపోయి తనవైన సలహాలు, సూచనలు ఇస్తున్నాడట. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా ఈసారి పవన్ పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగబోతున్నాడన్న మాట.

సురేందర్ రెడ్డితో సినిమా కోసం ప్రత్యేక ఆఫీస్

లుక్ మార్చారు.. గడ్డం పెంచారు.. ఎవరి కోసం?

కథ సంగతి ఇలా ఉంటే, పవన్ ఈ మధ్య గడ్డం పెంచుకుని కనిపిస్తుండటం చర్చనీయాంశమైంది. ఇది సురేందర్ రెడ్డి సినిమా కోసమే అని కొంతమంది అంటుంటే, సుజిత్ దర్శకత్వంలో వచ్చే ‘OG 2’ సీక్వెల్ కోసమని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. భారీ ఆశలు పెట్టుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షాక్ ఇవ్వడంతో, ‘ఓజీ’ హైప్‌ని క్యాష్ చేసుకోవాలంటే పార్ట్ 2 వర్క్స్ స్పీడప్ చేయాలని పవన్ ఆలోచిస్తున్నాడట. అంటే సూరి-వక్కంతంల స్క్రిప్ట్ ఏమాత్రం లేట్ అయినా, పవన్ వెంటనే ‘ఓజీ 2’ని పట్టాలెక్కించబోతున్నాడని ఇండస్ట్రీ టాక్.

ఓజీ 2 పై కూడా ఫోకస్ పెట్టిన పవన్

తన సొంత బ్యానర్ అయిన ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ని యాక్టివేట్ చేసి, కేవలం తను నటించడమే కాకుండా చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. గతంలో త్రివిక్రమ్‌తో కలిసి ‘ఛల్ మోహన్ రంగ’ నిర్మించి చేతులు కాల్చుకున్న పవన్‌కు, ఈసారి అయినా నిర్మాణం అచ్చొస్తుందో లేదో చూడాలి. మొత్తానికి పాత పవన్ కల్యాణ్‌ను మరోసారి ఆడియన్స్‌కు పరిచయం చేయాలని పవర్ స్టార్ ఫిక్స్ అయ్యాడు. మరి పవన్ ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాల్సిందే!

మొత్తానికి పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఉస్తాద్ సినిమా ఫలితం ఆయనకు ఒక గుణపాఠం నేర్పినట్లుంది. ఈసారి పక్కా ప్లానింగ్‌తోనే బరిలోకి దిగనున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.