|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ కు గాయం: పవన్ కళ్యాణ్ ఆందోళన! అభిమానుల్లో కలకలం!

Published: 25-03-2026, 7:35 AM
రామ్ చరణ్ కు గాయం: పవన్ కళ్యాణ్ ఆందోళన! అభిమానుల్లో కలకలం!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్లో స్వల్పంగా గాయపడ్డారు.
  • పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేశారు.
  • రామ్ చరణ్ కంటి పైభాగంలో గాయమైంది, నాలుగు కుట్లు పడ్డాయి.
  • గాయం తీవ్రత తక్కువగా ఉండటంతో రామ్ చరణ్ రేపటి నుండి షూటింగ్‌లో పాల్గొననున్నారు.

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ ప్రమాదం: అసలేం జరిగింది?

Pawan Kalyan:  టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న రామ్ చరణ్ ఇటీవల పెద్ది సినిమా షూటింగ్ సమయంలో చిన్న ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇలా ఈయన ప్రమాదానికి గురికావడంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఈ ప్రమాదంలో రామ్ చరణ్ (Ram Charan) కు ఎలాంటి గాయాలు తగలలేదని కంటి పై భాగంలో చిన్న దెబ్బ తగిలిందని చిత్ర బృందం తెలియ చేశారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ కు జరిగిన ఈ ప్రమాదం గురించి ఆయన బాబాయ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. రామ్ చరణ్ కు ఇలా ప్రమాదం జరిగిందనే విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

“రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలి.. అగ్రశ్రేణి యువ కథనాయకుడు రామ్ చరణ్ పెద్ది సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా ఈ పోస్ట్ పట్ల మెగా అభిమానులు స్పందిస్తూ త్వరగా రాంచరణ్ కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలుస్తుంది. కంటి పై భాగంలో నాలుగు కుట్లు పడ్డాయి. కంటికి ఎలాంటి ప్రమాదం లేదని తెలియజేశారు.

ఇక ఈ ప్రమాదం కారణంగా రెండు రోజులు విశ్రాంతి అవసరమని చెప్పినప్పటికీ రామ్ చరణ్ మాత్రం యధావిధిగా రేపటి నుంచి సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. రామ్ చరణ్ కు జరిగిన ప్రమాదం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవడంతో అభిమానులు స్పందిస్తూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇక పెద్ది సినిమా చివరి దశ షూటింగ్లో ఉంది. కుస్తీ పోటీలకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి అయిందని సమాచారం. ఒక వారం వ్యవధిలోగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి ఏప్రిల్ 30వ తేదీ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం చిత్ర బృందం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ స్పందన

రాంచరణ్ త్వరగా కోలుకోవాలి

అగ్రశ్రేణి యువ కథానాయకుడు రాంచరణ్ ‘పెద్ది‘ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

– @PawanKalyan @AlwaysRamCharan @PIB_India @IPR_AP @pibvijayawada

షూటింగ్ తిరిగి ప్రారంభం

— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 25, 2026

ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ వాయిదా పడుతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి కానీ చిత్ర బృందం మాత్రం ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదల కావడంతో తదుపరి పవన్ కళ్యాణ్ సినిమాల గురించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టీం ఈ వార్తలను ఖండిస్తూ ఏదైనా సినిమా చేస్తే అధికారికంగా వెల్లడిస్తామని, ప్రస్తుతం పవన్ సినిమాల గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

రామ్ చరణ్ త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనడం అభిమానులకు ఊరటనిచ్చే విషయం. ‘పెద్ది’ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.