
📌 Key Points
- రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం రూపొందుతోంది.
- వేసవి సెలవుల కారణంగా సినిమా విడుదల ఏప్రిల్ 30కి వాయిదా పడింది.
- ప్రమోషన్స్ లేకున్నా ‘పెద్ది’ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
- ‘దూల తీర్చి దూపం వేస్తున్నాం’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ మూవీ విడుదల తేదీ వాయిదా పడింది. అయితే, సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ లేకున్నా, సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్‌లో ఉంది.
‘పెద్ది’ మూవీ విడుదల వాయిదా
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా, బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా స్పోర్ట్స్-యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). ప్రస్తుతం ఈ చిత్ర ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమాను వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 30కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. చిత్రీకరణకు సంబంధించి కూడా ఆలస్యమవడంతో నిర్మాతలు ఈ వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నారు.. లేదంటే, రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతుండగా, మరోవైపు యూనిట్ ఎటువంటి ప్రమోషన్స్ నిర్వహించకపోయినా, ఈ మధ్యకాలంలో ‘పెద్ది’ పేరు ప్రతి రోజూ ట్రెండ్‌ను బద్దలు కొడుతూనే ఉంది.
తాజాగా ‘పెద్ది మూవీ’ అనే ఎక్స్ వేదికగా డోంట్ ట్రాప్ అంటూ ఓ ఇమేజ్‌ను వదిలారు. ఈ ఇమేజ్‌పై క్లిక్ కొడితే వేరే ఇమేజ్ ప్రత్యక్షమవుతోంది. రామ్ చరణ్ కంటి దగ్గర మాత్రం రెడ్ కలర్‌లో షేడ్స్ కనిపిస్తున్నాయి. ఇక ఈ పోస్ట్‌కు ‘దూల తీర్చి దూపం వేస్తున్నాం..’ (#DhoolaTheerchiDhupamEsthunnam) అనే ట్యాగ్‌ని జోడించారు. ఈ డైలాగ్ సినిమాలో ఉంటుందనే విషయాన్ని.. ఇటీవల బుచ్చిబాబు షూటింగ్‌లో చెబుతూ క్లారిటీ ఇచ్చారు. దీంతో దీనినే ట్రెండ్ చేస్తున్నారు. అవును, ‘దూల తీర్చి దూపం వేస్తున్నాం..’ ట్యాగ్ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కోసం బుచ్చిబాబు డైలాగ్స్ కూడా చాలా స్పెషల్‌గా ఉండేలా చూసుకున్నట్లుగా తన తాజా ఇంటర్వ్యూలో చెబుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడిలాంటి డైలాగ్స్ రెండు వస్తే మాత్రం.. ఇక ‘పెద్ది’ని పట్టుకోవడం ఎవరితరం కాదు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో ఓ రేంజ్‌లో బిజినెస్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడనేలా వైబ్ నడుస్తుంది. అదే జరిగితే.. బుచ్చిబాబుకు మెగా ఫ్యాన్స్ గుడి కట్టినా కట్టేస్తారు. ఆ వైబ్‌ని కలిగించింది మాత్రం ‘చికిరి చికిరి’ సాంగే అని చెప్పుకోవాలి. ఇందులో రామ్ చరణ్ ఊర మాస్ లుక్‌లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి స్టార్ యాక్టర్స్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.
Don’t Tap! #PEDDI 🔥 #DhoolaTheerchiDhupamEsthunnam pic.twitter.com/4VLqu2OxIE
వైరల్ అవుతున్న డైలాగ్
— PEDDI (@PeddiMovieOffl) February 17, 2026
మొత్తానికి ‘పెద్ది’ సినిమా విడుదల కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్ లేకున్నా సినిమాకు వస్తున్న హైప్ చూస్తుంటే, సినిమా భారీ విజయం సాధించేలా ఉంది.


