
📌 Key Points
- గత కొంతకాలంగా పూజా హెగ్డేకు విజయాలు లేవు, ‘ఐరన్ లెగ్’ ముద్ర పడింది.
- రాధే శ్యామ్ నుండి దేవా వరకు ఆమె నటించిన ఏడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
- ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో నాలుగు భారీ ప్రాజెక్టులలో నటిస్తోంది.
- ఈ సినిమాలలో ఒక్క హిట్ అయినా ఆమెపై ఉన్న ‘ఐరన్ లెగ్’ ముద్రను తొలగిస్తుందని ఆశ.
పూజా హెగ్డే వరుస పరాజయాలతో ‘ఐరన్ లెగ్’ ముద్రను ఎదుర్కొంటున్నా, ఆమె చేతిలో నాలుగు భారీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఒకప్పుడు లక్కీ ఛార్మ్ గా పేరొందిన ఆమె, ప్రస్తుతం ఒక హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ కొత్త సినిమాలతోనైనా ఆమె అదృష్టం మారుతుందో లేదో చూడాలి.
పూజా హెగ్డే పదేళ్ల కెరీర్
Pooja Hegde: బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా ఈ చిన్నది ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ముద్రతోనే కాలం గడిపేస్తుంది. ఇప్పటివరకు అమ్మడు నటించిన ఏ సినిమా కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. ఎప్పుడెప్పుడు ఈ చిన్నది ఒక హిట్టు అందుకుంటుందా అని అటు అభిమానులతో పాటు ఇటు ఇండస్ట్రీ కూడా ఎంతగానో ఎదురుచూస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి పూజా పదేళ్లు దాటింది. అవకాశాలను అందుకుంటున్నా కూడా ఈ చిన్నది విజయాలను మాత్రం దక్కించుకోలేకపోతుంది.
ఒకప్పుడు లక్కీ ఛార్మ్ గా ప్రశంసలు అందుకున్న పూజా.. ఏ ముహూర్తాన రాధే శ్యామ్ లో అడుగుపెట్టిందో కానీ, అమ్మడికి దురదృష్టం.. అదృష్టం పట్టినట్లు పట్టేసింది. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీకా భాయ్.. కిసీకా జాన్, దేవా, రెట్రో.. ఇలా స్టార్ హీరోల సినిమాలు చేసినా కూడా ఈ చిన్నదానికి విజయం మాత్రం దక్కలేదు. కూలీలో ఐటెంసాంగ్ అయినా అమ్మడిని నిలబెడుతుంది అంటే ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అది కూడా లిస్ట్ లో నుంచి తీసేయాలి. ఇన్ని ప్లాప్ ల తరువాత ఏ హీరోయిన్ కి అయినా ఛాన్స్ లు రావడం అనేది కల్లా అని చెప్పొచ్చు. కానీ పూజాకు మాత్రం వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి.
లక్కీ ఛార్మ్ నుండి ఐరన్ లెగ్ వరకు
ఇప్పటికే దళపతి విజయ్ చివరి సినిమా జననాయగన్ లో పూజానే హీరోయిన్. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగుతుంది. ఇది కాకుండా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన నటించే లక్కీ ఛాన్స్ పట్టేసింది. రవి నేలకుదుటి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగు సినిమాలో పూజానే హీరోయిన్. ఇక ఇది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇది కాకుండా లారెన్స్ కాంచన 4 లో కూడా అమ్మడు హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది. ఇది కూడా సెట్స్ మీద ఉంది.
చేతిలో నాలుగు భారీ ప్రాజెక్ట్‌లు
ఈ మధ్యనే పూజా.. హిందీలో హై జవాని తో ఇష్క్ హోనా హై సినిమా సెట్ లో అడుగుపెట్టింది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా పూజా అడుగుపెట్టింది. ఇలా ప్రస్తుతం బుట్టబొమ్మ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో స్ట్రాంగ్ లైనప్ ని సెట్ చేసుకుంది పూజా. ఎంత లైనప్ ఉంటే ఏం ప్రయోజనం.. లక్ కూడా ఉండాలి కదా అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ నాలుగు సినిమాల్లో ఏ ఒక్క సినిమా హిట్ అయినా కూడా చిన్నదానిపై ఉన్న ఐరెన్ లెగ్ అనే ముద్ర తొలగిపోతుంది. మరి పూజాకు ఆ లక్ ఇచ్చే హీరో ఎవరో చూడాలి.
వరుస ఫ్లాపులు ఉన్నప్పటికీ, పూజా హెగ్డేకు అవకాశాలు తగ్గలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న నాలుగు బహుభాషా ప్రాజెక్టులు ఆమె కెరీర్‌కు కీలకమైనవి. ఈ సినిమాలతోనైనా ఆమె తిరిగి విజయం సాధించి, ‘ఐరన్ లెగ్’ ముద్రను చెరిపేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


