
📌 Key Points
- రాజకీయాల నుంచి విరామం తర్వాత పోసాని కృష్ణ మురళి తిరిగి సినిమాల్లోకి వస్తున్నారు.
- నిజాయితీ గల జర్నలిస్టు కథాంశంతో ‘ఆపరేషన్ అరుణ రెడ్డి’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
- ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నానని, భవిష్యత్తులో తన నిర్ణయం వెల్లడిస్తానని తెలిపారు.
- ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని, తాను ఏ వర్గానికి చెందినవాడిని కాదని స్పష్టం చేశారు.
సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు విరామం ప్రకటించి సినిమాల్లోకి తిరిగి వస్తున్నారు. ‘ఆపరేషన్ అరుణ రెడ్డి’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన, రాజకీయ భవిష్యత్తు, సినిమా ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ.
పోసాని రీఎంట్రీ: ‘ఆపరేషన్ అరుణ రెడ్డి’ విశేషాలు
Posani Krishna Murali: టాలీవుడ్ సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. కొన్ని తరాల నుంచి ఆయన తన నటనతో తెలుగు ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నాడు. ఆలాగే ఆయన ఒక మంచి రచయిత, దర్శకుడు కూడా. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆపరేషన్ దుర్యోధన ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రతేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, గత కొంత కాలంగా ఆయన రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే, రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ఆయన మద్దతు ఇచ్చిన పార్టీ ఓడిపోవడంతో సినిమాల్లో బిజీ అవడానికి సిద్ధం అవుతున్నాడు.
Prabhas: ఏంటి ప్రభాస్ కమెడియనా.. సప్తగిరి అంత మాట అన్నాడేంటి.. సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారుగా
రాజకీయాలపై పోసాని సంచలన కామెంట్స్
తాజాగా ఆయన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ కోసం వచ్చారు. ఈ సందర్బంగా 10టీవీతో ఎక్సక్లూసివ్ గా మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలపై, సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఎప్పుడు ప్రశాంతగానే జరుగుతాయి. నేను గత 35 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. కేవలం ఎలెక్షన్ టైం లో మాత్రమే ఈ హడావుడి ఉంటుంది. ఎలక్షన్ అయ్యాక అందరు మళ్ళీ కలిసిపోయే ఉంటారు. ఇక్కడ ఎన్ని వర్గాలు ఉన్నాయి అనేది నాకు తెలియదు. నేను ఏ వర్గం మనిషి కాదు. ఎటువైపు మంచి ఉంటే అంటే నేను ఉంటాను.
ఫిలిం ఛాంబర్ ఎన్నికలపై పోసాని అభిప్రాయం
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం నేను ఆపరేషన్ అరుణ రెడ్డి అనే సినిమా చేస్తున్నాను. ఇది ఒక నిజాయితీగా ఉండే జర్నలిస్టు కథ. ఒక జర్నలిస్టు హానెస్ట్ ఉంటే ఇండియా మొత్తం ఆ జర్నలిస్టునే చూస్తుంది. అతనివైపే ఉంటుంది అని చెప్పే కథ. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి లో రిలీజ్ అవుతుంది. ప్రస్థుతానికి పాలిటిక్స్ లేవు. ఏదైనా ఉంటె నేనే చెప్తా. ఇక రాజకీయాల గురించి అంటే ఏదైనా ఉంటే నేనే చెప్తాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతానికి రాజకీయాల నుంచి దూరంగా ఉండి సినిమాపైనే పోసాని దృష్టి సారించారు. ‘ఆపరేషన్ అరుణ రెడ్డి’ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాజకీయాలపై నిర్ణయం చెబుతానని ఆయన స్పష్టం చేశారు.


