
📌 Key Points
- ఏపీలో ప్రభాస్, చిరు సినిమాల ప్రీమియర్ టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతి.
- ‘ది రాజా సాబ్’ ప్రీమియర్‌కు రూ. 800, జనవరి 8న ప్రీమియర్లు ప్రసారం.
- ‘MSVPG’ ప్రీమియర్‌కు రూ. 500, జనవరి 11న ప్రీమియర్లు ప్రసారం.
- పెరిగిన ధరలపై చిత్ర నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.
సంక్రాంతికి విడుదలవుతున్న ప్రభాస్ ‘ది రాజా సాబ్’, చిరంజీవి ‘MSVPG’ చిత్రాల ప్రీమియర్ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ‘ది రాజా సాబ్’ ప్రీమియర్ ధర రూ. 800 కాగా, ‘MSVPG’ చిత్ర ప్రీమియర్ ధర రూ. 500కు పెరిగింది. ఈ నిర్ణయంతో నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ప్రీమియర్ టికెట్ ధరలకు గ్రీన్ సిగ్నల్
The Raja Saab -MSVPG: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఈ ఏడాదిలో చిరంజీవి(Chiranjeevi), ప్రభాస్(Peabhas) సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే 11వ తేదీ నుంచి ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. మరోవైపు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ (The Raja Saab)సినిమా జనవరి 9వ తేదీ విడుదల కాగా 8వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి.
ఇలా ఈ సినిమా ప్రీమియర్లకు టికెట్ ధరలు పెంచాలనే ఆలోచనలో రెండు సినిమాల నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ విషయంలో తెలంగాణలో హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో కూడా ఈ సినిమాకు ప్రీమియర్ టికెట్ ధరలను పెంచమని ప్రభుత్వాన్ని కోరడంతో ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో 8వ తేదీ రాజా సాబ్ సినిమా ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి అయితే ప్రీమియర్లకు ఒక్కో టికెట్ చొప్పున 800 రూపాయలను పెంచడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తొమ్మిదవ తేదీ నుంచి ఈ సినిమా టికెట్ ధరలు రూ.250 చొప్పున అందుబాటులోకి రానున్నాయి.
రాజా సాబ్ టికెట్ ధరలు: ఏకంగా రూ. 800?
ఇక చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీమియర్లు 11వ తేదీ ప్రసారం కానున్నాయి. ఈ ప్రీమియర్లకు 500 రూపాయలు చొప్పున టికెట్ ధరలను పెంచడానికి ఏపీ సర్కార్ అనుమతి తెలిపింది. ఇక ఈ సినిమా 12వ తేదీ విడుదల కాగా రూ. 250 లకు ఏపీ ప్రభుత్వం అనుమతి తెలిపిందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల ప్రీమియర్లకు టికెట్ల ధరలు పెంచడానికి ఏపీ సర్కార్ అనుమతి తెలపడంతో చిత్ర నిర్మాతలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు .ఈ సినిమా కోసం సుమారు 450 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు షైన్ స్క్రీన్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి బరిలో దిగబోతున్న ఈ సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకుంటాయో తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాలో నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేశాయి.
MSVPG ప్రీమియర్ టికెట్ ఎంతంటే?
మొత్తంగా, ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభాస్, చిరంజీవి అభిమానులకు కాస్త భారం కానుంది. అయితే, చిత్ర నిర్మాతలకు మాత్రం భారీగా వసూళ్లకు ఇది కలిసొస్తుందని అంచనా. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.


