|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ డైట్ సీక్రెట్స్ లీక్: రోజుకు రెండు లక్షల విందు! ఇంతకీ ఆ మెనూలో ఏముందో?

Published: 13-04-2026, 10:35 AM
ప్రభాస్ డైట్ సీక్రెట్స్ లీక్: రోజుకు రెండు లక్షల విందు! ఇంతకీ ఆ మెనూలో ఏముందో?
  • ప్రభాస్ రోజుకు 2 లక్షల రూపాయల విలువైన ఆహారం తీసుకుంటారు, దానిని సిబ్బందికి కూడా పంచుతారు.
  • ప్రభాస్ కోసం ప్రత్యేకంగా వంట చేసే బృందం ఉంది.
  • చేపలు, రొయ్యలు, చికెన్, మటన్, పీతలు వంటి వంటకాలను ప్రభాస్ ఎక్కువగా ఇష్టపడతారు.
  • కృష్ణంరాజు గారికి, ప్రభాస్ కి కూడా చేపల పులుసు అంటే చాలా ఇష్టం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైట్ గురించి ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రభాస్ రోజుకు రెండు లక్షల రూపాయల విలువైన ఆహారం తీసుకుంటారని, ఆయనకు ప్రత్యేకంగా వంట చేసే బృందం ఉందని ఆమె తెలిపారు.

ప్రభాస్ డైట్ సీక్రెట్స్ రివీల్ చేసిన శ్యామలాదేవి

Prabhas:పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతున్న ప్రభాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు..చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా మారిపోయారు. ఈ ఏడాది ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్ సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు. అలాగే మరికొన్ని చిత్రాలను లైన్ లో పెట్టారు ప్రభాస్. ఇలాంటి సమయంలో ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే 46 సంవత్సరాల వయసులో కూడా ఇంత యంగ్ గా, ఫిట్ గా ఉండడానికి అసలు కారణం ఏమిటి ? ఈయన డైట్ సీక్రెట్ ఏంటి ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. వాటిని ఆయన పెద్దమ్మ, దివంగత సినీ నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రివీల్ చేశారు.

శ్యామలాదేవి ప్రభాస్ గురించి మాట్లాడుతూ..” కృష్ణంరాజు లాగానే ప్రభాస్ కూడా భోజన ప్రియులు.. కనిపించిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టడం ప్రభాస్ స్టైల్ .. ముఖ్యంగా షూటింగ్ సెట్లో కూడా ఒక్కడే తిన్న రోజులు అసలు లేవు. ఆయన చుట్టూ ఉండే 10 , 20 మందితో కలిసి భోజనం చేస్తారు. వారందరికీ ప్రభాస్ స్వయంగా భోజనం ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ప్రభాస్ కోసం స్పెషల్ గా ఒక కుకింగ్ టీం కూడా ఉంది. ఒక రోజులో సుమారుగా రూ.2లక్షల విలువైన ఫుడ్ ను ప్రిపేర్ చేసి సెట్ లో అందరికీ వడ్డిస్తారు. ముఖ్యంగా చేపలు, రొయ్యలు , చికెన్, మటన్, పీతలు వంటి వంటకాలు ఎక్కువగా చేయిస్తారు” అంటూ ప్రభాస్ ఆహారపు మెనూ, వాటి కాస్ట్ ను చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు శ్యామలాదేవి.

ప్రభాస్ రోజువారీ భోజనం ఖర్చు ఎంత?

కృష్ణంరాజు గారికి ఇష్టమైన వంటకాలు

ఇక అలాగే తన భర్త కృష్ణంరాజు అభిరుచుల గురించి మాట్లాడుతూ. ” కృష్ణంరాజు మంచి భోజన ప్రియులు . అతిధుల పట్ల అపారమైన ఆతిథ్యం చూపేవారు.. ఎవరైనా ఇంటికి వస్తే వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను ముందుగానే అడిగి తెలుసుకుని, వండించి స్వయంగా వడ్డించేవారు..ఇంట్లో తయారు చేసే చేపల పులుసు , పులావ్, రసం, రొయ్యల కూర , బిర్యాని వంటి వంటకాలను ఎక్కువగా ఇష్టపడేవారు .ముఖ్యంగా చేపల పులుసు అంటే కృష్ణంరాజుతో పాటు ప్రభాస్ కి కూడా చాలా ఇష్టం . ఈస్ట్ , వెస్ట్ గోదావరి ప్రాంతాల నుండి పులస చేప దొరికితే వెంటనే ఇంటికి తీసుకొస్తారు. కృష్ణంరాజు గారు అయితే ఆహారాన్ని రుచి చూడకుండానే కేవలం వాసనతో ఉప్పు సరిపోయిందో లేదో చెప్పగలిగే వారు అంటూ శ్యామలాదేవి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం శ్యామలాదేవి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అటు కృష్ణంరాజు ఇటు ప్రభాస్ ఆహారపు అలవాట్లను.. ఇతరులకు వారు ఇచ్చే ఆతిథ్యం గురించి ఆమె చెప్పుకొచ్చారు.

ప్రభాస్ మరియు కృష్ణంరాజు గారి భోజన ప్రియత్వం గురించి శ్యామలాదేవి పంచుకున్న ఈ విషయాలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వారి ఆహారపు అలవాట్లు ఎంతో ప్రత్యేకమైనవి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.