
📌 Key Points
- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు.
- జపాన్‌లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది, సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
- ప్రభాస్ క్షేమంపై ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- దర్శకుడు మారుతి, ప్రభాస్ అభిమానులకు కీలక అప్‌డేట్ ఇచ్చారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జపాన్‌లో ఉన్న సమయంలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఆయన క్షేమంపై అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మారుతి ఇచ్చిన అప్‌డేట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
జపాన్‌లో ప్రభాస్ పర్యటన, భూకంపం తీవ్రత
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. అయితే.. సోమవారం జపాన్‌ను భూకంపం వణికింది. ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేల్ పై దీని తీవ్రత 7.6గా నమోదైంది. హొక్కైడో ద్వీపానికి, అమోరి ప్రాంతానికి సమీపంలో సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ క్రమంలో అక్కడ సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఎలా ఉన్నారో అని ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు.
ప్రభాస్ అభిమానుల ఆందోళన, సోషల్ మీడియా పోస్టులు
ఇటీవల ప్రభాస్ (Prabhas) నటించిన బాహుబలి రెండు చిత్రాలను కలిపి బాహుబలి ది ఎపిక్‌గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని జపాన్‌లో డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో అక్కడ ప్రమోషన్స్‌లో ప్రభాస్ పాల్గొంటున్నారు. జపాన్‌లో భూకంపం రావడంతో ఆయన ఎలా ఉన్నారో అన్న టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
దర్శకుడు మారుతి కీలక ప్రకటన
Jr NTR : ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్..
జపాన్‌లో భూకంపం నేపథ్యంలో ప్రభాస్ క్షేమంగా ఉన్నారని మారుతి ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి సమయంలో సెలబ్రిటీల గురించి అప్‌డేట్స్ పంచుకోవడం చాలా ముఖ్యం.


