
📌 Key Points
- ప్రభాస్ ఆత్మీయ ఆలింగనంతో సంతోష్ శోభన్ ఆనందానికి అవధుల్లేవ్!
- కపుల్ ఫ్రెండ్లీ మూవీ టీమ్‌తో ప్రభాస్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
- సంతోష్ శోభన్ కోరిక మేరకు ప్రభాస్ ఇంటర్వ్యూలో పాల్గొనడం విశేషం.
- విజయవాడ పునుగుల గురించి మానస అడగడంతో నవ్వులు విరిశాయి.
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీకి ప్రభాస్ మద్దతు తెలిపారు. చిత్ర బృందంతో కలిసి ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభాస్ సపోర్ట్‌తో కపుల్ ఫ్రెండ్లీ టీమ్ సందడి
Prabhas: సంతోష్ శోభన్, మానస వారణాసి (Manasa Varanasi) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly). ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం భారీ సక్సెస్ దిశగా దూసుకెళుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌ని మేకర్స్ ఇంకా ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ మూవీ టీమ్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ఫుల్ సపోర్ట్ అందించారు. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా ప్రభాస్ దిగివచ్చారు. చిత్ర టీమ్‌తో కలిసి ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ హగ్ పొందిన సంతోష్ శోభన్ (Santosh Soban) ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆ ఫొటో షేర్ చేసి.. ‘ఇది నేను గెలిచిన రోజు’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను గమనిస్తే..
‘‘సినిమా హిట్ కొట్టగానే మా డైరెక్టర్ కారు అడుగుతున్నాడు. మా హీరోయిన్ నన్ను పార్టీ అడిగింది. సక్సెస్ మీట్ ఎక్కడ? అని అడిగింది. మా అజయ్ అన్నని ఒక్కటే ఒక్కటి అడిగాను. అన్నా.. సినిమా హిట్ కొడితే.. ఇది మాత్రం జరిగేలా చూడండి అని అడిగాను. లైఫ్‌లో ఇంకేమీ అడగను, ఇదొక్కటి చాలు అని అడిగాను నేను. అదే ఇది..’’ అని సంతోష్ అనగానే ప్రభాస్ ఎంట్రీ.. ‘బాగుంది.. మంచి సినిమాతో కలిశాం. సినిమా అదిరిపోయింది. లాస్ట్ 20 మినిట్స్ అయితే మాములుగా లేదు. ఈ క్రెడిట్ డైరెక్టర్‌కే ఇవ్వాలి. సంతోష్, హీరోయిన్‌కు సూపర్బ్ ఫిల్మ్. ఫేవరేట్ సినిమా ఏంటి అంటే.. ‘గీతాంజలి’ అనగానే.. మీకు ‘గీతాంజలి’ ఇష్టమా? మీరు యాక్షన్ ఎక్కువ చేస్తారు కదా అనే వాళ్లు. యాక్షన్ కూడా ఇష్టమే. అన్నీ ఇష్టమే. 3, 4 టైమ్స్ చూస్తా’’ అని ప్రభాస్ చెబుతున్నారు.
సంతోష్ శోభన్ ఆనందానికి కారణం ఇదే!
యూవీ క్రియేషన్స్ అంటే నాకు ఫ్యామిలీ కదా అన్నా.. ఇది నా ఫోర్త్ ఫిల్మ్.. మీకంటే ఒక సినిమా ఎక్కువే చేశా? అని సంతోష్ అనగానే.. ‘‘నిన్ను వాళ్లు వదలరు.. నువ్వు వాళ్లని వదలవ్’’ అని ప్రభాస్ సరదాగా ఆటపట్టిస్తున్నారు. విజయవాడలో ఎప్పుడైనా పునుగులు ట్రై చేశారా? అని హీరోయిన్ మానస అడగగానే అందరూ నవ్వేశారు. ‘అన్నా.. నేనొక షాకింగ్ న్యూస్ విన్నారు. మీకు కొంచెం ఓవర్ అనిపించినా, కొట్టినా, తిట్టినా సరే..’ అంటూ సంతోష్ ఏదో పర్సనల్ క్వశ్చన్ అడిగారు. ‘మీకు లవ్ అంటే ఏమిటి?’ అని మానస అడగగానే.. ‘పర్సనల్ క్వశ్చన్ కదా ఇది’ అని ప్రభాస్ అన్నారు. ‘ఐ వాంట్ టు ఫాలో ఇన్ లవ్’ ఆ ఫీలింగ్ వచ్చింది ఈ సినిమా చూడగానే అని తర్వాత ప్రభాస్ అన్నారు. ‘మీరూ ఈ సినిమా చూడండి.. లేకపోతే మీరు ఎంతో కొంత మిస్సవుతారు. మీ ఇష్టం.. చూస్తే చూడండి.. లేకపోతే లేదు’ అని ప్రభాస్ సినిమాపై భారీగా హైప్ పెంచేశారు.
India’s Biggest Superstar with the sweetest talks 🫶
DARLING TALKS with the blockbuster team of #CoupleFriendly ❤️
Full interview tomorrow 🫶
ప్రభాస్, సంతోష్ మధ్య సరదా సంభాషణ
The BLOCKBUSTER LOVE STORY OF THE SEASON running successfully in theatres ❤️
Book your tickets now! 🎟️ https://t.co/fPvjbAKduF … pic.twitter.com/zgf2d557lN
— UV Creations (@UV_Creations) February 19, 2026
మొత్తానికి ప్రభాస్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రానికి తన మద్దతు తెలుపడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. సంతోష్ శోభన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఇంటర్వ్యూ ప్రోమో సినిమాపై అంచనాలు పెంచేసింది.


