
📌 Key Points
- ప్రభాస్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
- సంతోష్ శోభన్, మానస వారణాసి నటనను ప్రభాస్ మెచ్చుకున్నారు.
- ఈ సినిమా వర్షం సినిమాను గుర్తు చేసిందని ప్రభాస్ అన్నారు.
- వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా చూసి చాలా సంతోషించానని, చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రభాస్ ప్రశంసలు
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కెరియర్ పరంగా ఎన్నో అద్భుతమైన సినిమాలకు కమిట్ అయి వరుస సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉండే ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు కానీ ఈయన సోషల్ మీడియా వేదికగా ఇతర సినిమాలపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు చేయడం ఇతర సినిమాలకు మద్దతు ప్రకటించడం చేస్తూ ఉంటారు. ప్రభాస్ కు ఏదైనా సినిమా నచ్చింది అంటే వెంటనే చిత్ర బృందం పై ప్రశంసలు కురిపిస్తూ ఈయన పోస్టులు పెడుతుంటారు. తాజాగా ప్రభాస్ సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ (Couple friendly) సినిమాపై ప్రశంసలు కురిపించారు. నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా కపుల్ ఫ్రెండ్లీ సినిమా గురించి స్పందిస్తూ. చాలా అందమైన చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. ఈ సినిమాని చూడటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సంతోష్, మానస వారణాసి చాలా అద్భుతంగా చేశారని, ఇలాంటి కథలను వెండితెరపైకి తీసుకువచ్చినందుకు అశ్విన్, అజయ్ అలాగే యు వి క్రియేషన్స్, చిత్ర బృందం మొత్తానికి అభినందనలు అంటూ తెలియచేశారు.
సినిమాపై డార్లింగ్ రివ్యూ
ఇక ఈ సినిమా నాకు వర్షం సినిమా భావన కలిగించిందని నా ప్రియమైన సంతోష్ శోభన్ కోసం ఇది కపుల్ ఫ్రెండ్లీ అవుతుంది అంటూ ఈ సినిమా పట్ల ప్రభాస్ ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ప్రభాస్ రివ్యూ ఇవ్వడంతో ఈ సినిమా పట్ల మరింత బజ్ ఏర్పడిందని చెప్పాలి. ఇక ఈ సినిమా ఎమోషనల్ లవ్ అండ్ రొమాంటిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పర్ఫెక్ట్ వాలెంటైన్స్ డే సినిమా అనే చెప్పాలి. ఇలా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంటుంది.
కపుల్ ఫ్రెండ్లీతో హిట్ కొట్టిన సంతోష్..
వైరల్ అవుతున్న పోస్ట్
ఇక సంతోష్ శోభన్ ఇటీవల కాలంలో పలు సినిమాలలో నటించిన ఈయనకు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ఇచ్చిన సంతోష్ తాజాగా కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు తదుపరి ఎలాంటి అవకాశాలు వస్తాయనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మానస చౌదరి తన నటనతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో రాజీవ్ కనకాల, యోగి బాబు, గోపరాజు రమణ,లివింగ్‌స్టన్ వంటి తదితరులు నటించారు.
మొత్తానికి ప్రభాస్ కపుల్ ఫ్రెండ్లీ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిద్దాం.


