
📌 Key Points
- గతంలో ప్రీమియర్లు లేకుండానే తెలుగులో ఎన్నో పెద్ద సినిమాలు రికార్డులు సృష్టించాయి.
- ఇప్పుడు ప్రేక్షకులు మార్నింగ్ షోలకు బదులు, టాక్ కోసం రాత్రి షోలకు వేచి చూస్తున్నారు.
- ప్రీమియర్ షోల టికెట్ రేట్లు అధికంగా ఉండటం వల్ల సాధారణ ప్రేక్షకులు వెనక్కి తగ్గుతున్నారు.
- పెద్ద సినిమాల ఓపెనింగ్ డే కలెక్షన్లపై ప్రీమియర్లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనే ఆందోళన ఉంది.
ఇటీవల కాలంలో ప్రతి పెద్ద సినిమాకు ప్రీమియర్ షోలు తప్పనిసరయ్యాయి. అయితే, ప్రతి సినిమాకి ఇవి నిజంగా అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రీమియర్లు, అధిక టికెట్ ధరలు మొదటి రోజు కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనే ఆందోళన పెరుగుతోంది. దీనిపై నిర్మాతలు పునరాలోచించాల్సిన అవసరం ఉంది.
ప్రీమియర్ షోలతో ఓపెనింగ్స్‌కు నష్టమా?
Premiere Shows: ఇటీవల కాలంలో ప్రతి పెద్ద సినిమాకు ప్రీమియర్ షోలు తప్పనిసరి అన్నట్లుగా మారింది. కానీ నిజంగా ప్రతి సినిమాకి ప్రీమియర్లు అవసరమా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రేక్షకుల్లో వస్తోంది. ఒకప్పుడు ప్రీమియర్లు లేకుండానే తెలుగులో.. ఎన్నో పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. అవి రికార్డులు సృష్టించలేదా? అప్పట్లో కూడా ఫస్ట్ డే.మీ ఫస్ట్ షో క్రేజ్ ఉండేది. వర్డ్ ఆఫ్ మౌత్ ఆధారంగా సినిమాలు భారీ వసూళ్లు సాధించేవి.
ఇప్పుడు పరిస్థితి మారింది. ముఖ్యంగా నిజాం ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ చేస్తే..ఎక్కువమంది 9 గంటల షో టాక్ చూసి టికెట్లు బుక్ చేసుకుందాం అని ఆలోచిస్తున్నారు. అంటే ఉదయం లేదా మధ్యాహ్నం షోలకి బుకింగ్స్ తగ్గిపోతున్నాయి. దీని వల్ల డే 1 రెవెన్యూలో నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నిర్మాతలు..డిస్ట్రిబ్యూటర్లు నిజంగా ఆలోచిస్తున్నారా అనే సందేహం ఉంది.
ఆంధ్ర ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి. కొన్ని సెంటర్లలో ప్రీమియర్ షోల టికెట్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ రేట్లు చూసి సాధారణ ప్రేక్షకులు వెనక్కి తగ్గుతున్నారు. ఫలితంగా మొదటి రోజు కలెక్షన్లపై ప్రభావం పడుతోంది. పెద్ద సినిమాలకు ఇది మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉంది.
అధిక టికెట్ ధరలు, ప్రేక్షకుల ఆసక్తి
ఇప్పుడు వస్తున్న సినిమా ది రాజా సాబ్. ప్రభాస్ సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ప్రీమియర్ షోలు..అధిక టికెట్ ధరలు ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడతాయో అనేది చర్చనీయాంశం. ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా అంటే ఫస్ట్ డేనే ఎక్కువగా జనాలు థియేటర్లకు రావాలి. కానీ టాక్ కోసం ఆగే పరిస్థితి వస్తే..ఓపెనింగ్ డే కలెక్షన్లు తగ్గే ప్రమాదం ఉంది.
చిన్న సినిమాల విషయంలో టాక్ చూసి మరుసటి రోజు ప్రేక్షకులు ఎక్కువగా బుక్ చేస్తారని అనుకోవచ్చు. కానీ పెద్ద సినిమాలకు అదే ఫార్ములా పని చేయకపోవచ్చు. పెద్ద సినిమాలు మొదటి రోజు వసూళ్ల మీదే ఎక్కువగా ఆధారపడతాయి. ప్రీమియర్లు, రేట్లు కలిసి ఆ మోమెంటాన్ని తగ్గిస్తున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
పెద్ద సినిమాలపై ప్రీమియర్ల ప్రభావం
కాబట్టి ప్రతి సినిమాకి ప్రీమియర్లు అవసరమా? లేక కొంతమంది సినిమాలకు మాత్రమే ఈ విధానం సరిపోతుందా? నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలు ఈ విషయంపై మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితిలో ప్రతి సినిమాకు ప్రీమియర్లు అవసరమా, లేక కొన్నింటికే సరిపోతాయా అనేది చర్చనీయాంశం. నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాలు ఈ విధానంపై మరోసారి ఆలోచించి, ప్రేక్షకుల ఆసక్తిని, కలెక్షన్లను దృష్టిలో ఉంచుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.


