|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రియదర్శి కెరీర్ గ్రాఫ్ పడిపోయిందా? ‘బలగం’ తర్వాత దారుణమైన ఫలితాలు!

Published: 27-03-2026, 9:35 AM
ప్రియదర్శి కెరీర్ గ్రాఫ్ పడిపోయిందా? 'బలగం' తర్వాత దారుణమైన ఫలితాలు!
  • ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సుయోధన’ విడుదలైన విషయం చాలా మందికి తెలియదు.
  • ‘బలగం’ తర్వాత ప్రియదర్శి నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
  • ప్రమోషన్లు సరిగా చేయకపోవడం వల్ల ‘సుయోధన’ సినిమాపై మేకర్స్‌కు నమ్మకం లేదని తెలుస్తోంది.
  • హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రియదర్శి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా అనేది వేచి చూడాలి.

ప్రియదర్శి ‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బలగం’ సినిమాతో ఆయన కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. కానీ, ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా విడుదలైన ‘సుయోధన’ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.

‘బలగం’ తర్వాత ప్రియదర్శి కెరీర్ ఎలా ఉంది?

priyadarshi: ప్రియదర్శి..’పెళ్లి చూపులు’తో సైడ్ క్యారెక్టర్ గా మొదలెట్టిన ఇతగాడి కెరీర్ బలగంతో ఓ రేంజ్ కి వెళ్ళిన సంగతి తెల్సిందే.అయితే ఆ సినిమా ఏ నిమిషాన హిట్టయిందో కానీ అప్పటి నుండి వరుస హీరో పాత్రలు వేస్తూ వరుస డిజాస్టర్లతో తెల్లమొహం వేయాల్సిన పరిస్థితి.ఇక తాజాగా ఈరోజే వచ్చిన సుయోధన అయితే అసలు రిలీజ్ అయిన విషయం మేకర్స్ కైనా తెలుసా లేదా అన్నంతంగా ప్రమోషన్స్ వీక్ గా చేస్తున్నారంటే సినిమాపై మేకర్స్ కున్న కాన్ఫిడెన్స్ ఏంటో తెలుస్తుంది.

ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది

ఇక ఒకసారి ఈ కమెడియన్ ..సారీ సారీ హీరోగారి కెరీర్ చూసుకుంటే క్వాలిటీ తక్కువ క్వాంటిటీ ఎక్కువ అన్నట్టుగా ఉంది.అవును పోయినేడు ‘కోర్ట్’ తో ఏదో మ్యాజిక్ చేశాడనుకున్నారు అంతా,కానీ ఆ తర్వాత వరుసగా వచ్చిన సినిమాలు అసలు ఎప్పుడొచ్చాయో తెలీనంత వేగంగా వెళ్లిపోయాయ్ . ‘సారంగపాణి జాతకం’ అని ఇంద్రగంటి తీసిన సినిమా ప్రియదర్శి జాతకాన్ని అసలు మార్చలేకపోయింది.ఇక ‘మిత్రమండలి’అనే సినిమా గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘ప్రేమంటే’ అనే సినిమా అసలు రిలీజ్ అయిందన్న సంగతి కూడా ఆడియన్స్ కి గుర్తు లేదంటే ఇతగాడి సినిమాలు ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయో అర్థమవుతుంది.ఇండస్ట్రీలో హీరోగా పాగా వేయాలనుకున్న హీరోకి ఇది కాస్త ఇన్సల్ట్ అనే చెప్పాలి.

‘సుయోధన’ సినిమాకు ఎందుకు ప్రమోషన్స్ లేవు?

సుయోధన అంటూ మరో సినిమాతో థియేటర్లోకి ఎంట్రీ

ఇక ఇన్ని ప్లాపులు ఎదురైనా ఎక్కడా తగ్గకుండా సుయోధన అంటూ మరో సినిమాతో థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రియదర్శి. ఇక సాయికుమార్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నా ,సినిమా రిలీజ్ దగ్గర పడ్డా కూడా తూతూ మంత్రంగా ఒక ఈవెంట్ పెట్టేసి చేతులు దులుపుకున్న మేకర్స్ ని మెచ్చుకోవాల్సిందే.ఇక్కడ హీరోగా చేయాలన్న ఫైర్ ఉండటం తప్పు కాదు, కానీ చేస్తున్న సినిమాలు ఎలా వస్తున్నాయో కూడా తెల్సుకోవడం చాలా ముఖ్యం.

ఇక వైపు బాక్సాఫీస్ వద్ద దురంధర్ 2 దంచి కొడుతుంటే ఉస్తాద్ వంటి సినిమాలే చల్లగా జారుకుంటున్న ఈ టైంలో ప్రమోషన్లని పెద్దగా చేయని సుయోధనని పట్టించుకుంటారా అంటే అనుమానమే. అసలు ఊరు పేరు లేని ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’వంటి చిన్న సినిమాలే తెగ సందడి చేస్తున్న ఈ రోజుల్లో ప్రియదర్శి కనీసం సౌండ్ చేయట్లేదంటే మార్కెట్ వాల్యూ ఎంత పడిపోయిందో అర్థం అవుతుంది.

హీరోగా ప్రియదర్శి నిలదొక్కుకుంటాడా?

ఐయాం ది స్టార్ అని అనుకోకుండా

పది సినిమాలకి సైన్ చేశాను. ఇపుడు ఐయాం ది స్టార్ అని అనుకోకుండా ఇప్పటికైనా డా కథల మీద ఫోకస్ చేస్తే మంచింది. లేదంటే ‘బలగం’తో వచ్చిన క్రేజ్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరై.. ఇండస్ట్రీ ఎగ్జిట్ అవ్వడానికి ఏంటో టైం పట్టదు.

మొత్తానికి ప్రియదర్శి హీరోగా నిలదొక్కుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఆయన ఎంచుకునే సినిమాలు, వాటి ప్రమోషన్లపై దృష్టి పెట్టకపోతే కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.