
📌 Key Points
- నంది అవార్డులను కించపరిచేలా వంశీ నందిపాటి వ్యాఖ్యలు
- ప్రాస కోసం నోరు జారానని వివరణ ఇచ్చిన వంశీ
- ‘హే బల్వంత్’ సక్సెస్ మీట్‌లో క్షమాపణ
- చిన్నప్పటి నుండి నంది అవార్డు అందుకోవాలని ఆశ ఉండేదన్న వంశీ
యంగ్ నిర్మాత వంశీ నందిపాటి నంది అవార్డుల గురించి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. దీనితో ఆయన వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పారు. ఈ వివాదంపై ఆయన వివరణ ఇస్తూ మనోభావాలు దెబ్బతింటే క్షమించమని కోరారు.
వంశీ నందిపాటి వివాదాస్పద వ్యాఖ్యలు
Nandi Award: రీసెంట్‌గా యంగ్ నిర్మాత వంశీ నందిపాటి (Vamsi Nandipati) ‘నంది అవార్డు’ (Nandi Award)ను పోల్చిన తీరు కాంట్రవర్సీ అయిన విషయం తెలిసిందే. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లో.. అందులో నటించిన లయ గురించి చెబుతూ.. ‘లయకు అప్పట్లో నందులు పందుల్లా వచ్చాయి’ అని నోరు జారారు. వాస్తవానికి ఆయన ఉద్దేశం నంది అవార్డులను కించపరచడం కాదు, ప్రాస కోసం వెళ్లి.. ఇరుకున పడ్డారు. ‘నాన్నా పందులే గుంపులుగా వస్తాయి’ అనే డైలాగ్ ప్రకారం.. ఆమె నటనకు నందులు ఎన్నో వచ్చాయి అని చెప్పడానికి ఆయన ఈ విధంగా ప్రాసకు పోయి కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ఆయన నంది అవార్డులను అవమానించారంటూ ఆ రోజు నుంచి ఏ మీడియా పడితే ఆ మీడియా, ఎక్కడ పడితే అక్కడ.. ఏసుకుంటూనే ఉంది. ఇక, ఈ గోల అంతా ఎందుకని భావించిన వంశీ నందిపాటి, తాజాగా జరిగిన ‘హే బల్వంత్’ సక్సెస్ మీట్‌లో సారీ చెబుతూ.. తన స్టేట్‌మెంట్‌పై వివరణ కూడా ఇచ్చారు.
క్షమాపణ చెప్పిన నిర్మాత వంశీ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆ ఈవెంట్‌లో సడెన్‌గా మాట దొర్లాను. అది నా స్టేట్‌మెంట్ కాదు. తప్పుగా వెళ్లింది. 12 సంవత్సరాల క్రితం ఎవరో అన్న స్టేట్‌మెంట్‌ను గుర్తు చేశాను. అప్పట్లో ఇలా అనేవారు అన్నాను. నాకు దేవుడి మీద, అవార్డ్స్ మీద అపారమైన గౌరవం వుంది. దేవుడు అంటే ఎంతో భక్తి ఉందో, అవార్డ్స్ మీద కూడా అంతే గౌరవం ఉంది. నాకు చిన్నప్పటి నుండి నంది అవార్డ్స్ వంటి అవార్డు అందుకోవాలని ఆశగా ఉండేది. ఆ కలతోనే సినీ పరిశ్రమకు వచ్చాను. అలాంటి గొప్ప అవార్డ్స్ గురించి నేను తప్పుగా ఎందుకు మాట్లాడతాను. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉండే ఐయామ్ రియల్లీ సారీ’’ అని కాంట్రవర్సీపై వంశీ స్పందించారు. ఆయనే తన మిస్టేక్ తెలుసుకుని సారీ చెప్పారు కాబట్టి.. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందనే అనుకోవచ్చు.
‘హే బల్వంత్’ సక్సెస్ మీట్‌లో వివరణ
ఇంక ‘హే బల్వంత్’ గురించి వంశీ నందిపాటి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా విషయంలో మేము చాలా హ్యపీగా ఉన్నాం. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ కావడం ముఖ్యంగా నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం. చాలా తక్కువ మంది మాత్రమే మా సినిమాకు బ్రేక్ ఈవెన్ అయ్యిందని దైర్యంగా చెబుతారు. అలాంటి కోవలో ‘హే బల్వంత్’ కూడా నిలిచినందుకు ఆనందంగా ఉంది. ఎప్పుడైనా సరే, నిర్మాత నిలబడితే ఎన్నో మంచి సినిమాలు వస్తాయి. ప్రొడ్యూసర్ మనీ రికవరీ అయితేనే ఆ సినిమా సక్సెస్‌ఫుల్ సినిమాగా నిలుస్తుంది. ఆ విషయంలో ఈ సినిమా విజయం సాధించింది. త్వరలోనే దర్శకుడు గోపీతో మరో సినిమా చేస్తున్నాం. ‘హే బల్వంత్’ సినిమాను దాదాపు 10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాం. ఓటీటీ, శాటిలైట్, ఇతర హక్కులు, థియేటర్స్ కలెక్షన్స్ అన్ని కలిసి ఆ పది కోట్లు పెట్టుబడి సాధించాం. యూఎస్‌లో కూడా మంచి వసూళ్లు వచ్చాయి. రానున్న రోజుల్లో ప్రాఫిట్స్ జోన్‌లోకి వెళ్లనున్నాం’’ అని చెప్పుకొచ్చారు.
వంశీ నందిపాటి తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లు అయింది. ఆయన ‘హే బల్వంత్’ సినిమా సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.


