
📌 Key Points
- అల్లు అర్జున్ ‘రాకా’ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నారు – పగలు మనిషిగా, రాత్రికి మృగంగా మారే అవకాశం ఉంది.
- దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాగూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
- ‘రాకా’ సినిమా సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మాణంలో సుమారు 800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
- అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’తో పాటు ‘పుష్ప 3’లో నటిస్తున్నారు, ఆ తర్వాత లోకేష్ కనగరాజుతో సినిమా చేయనున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆయన ఒక పాత్రలో మనిషిగా, మరొక పాత్రలో మృగంలా కనిపించనున్నారు.
రాకా మూవీ స్టోరీ లీక్
Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొని, వాటన్నింటిని దాటుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకుంటున్నారు.. తన నటనతో, విలక్షణ నటుడిగా ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్న ఈయన పుష్ప సినిమాతో సంచలనం సృష్టించి.. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అదే రాకా. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సుమారుగా 800 కోట్లు బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా నుండి ఒక చిన్న అప్డేట్ కూడా వదలకుండా సడన్గా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమా టైటిల్ తో పాటు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇందులో బన్నీ గెటప్ ఏంటి అంటూ ప్రశ్నలు గుప్పించారు. అంతేకాదు ఇందులో హీరోగా, విలన్ గా రెండు పాత్రలు బన్నీనే చేస్తున్నాడు అంటూ వార్తలు రా..గా ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ రాకా సినిమా నుంచి బయటకు వచ్చి అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ సినిమాలో రెండు పాత్రలలో కనిపిస్తారట. పగలు మనిషిలా, రాత్రి మృగంలా అల్లు అర్జున్ మారిపోతాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇలాంటి కాన్సెప్ట్ తో బేడియా సినిమా వచ్చింది. రాకా సినిమా కూడా ఈ సినిమాలాగే ఉంటుందా? లేక కథలో ఏదైనా మార్పులు చేస్తారా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది. ఏది ఏమైనా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మరి అట్లీ తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వార్తను దృష్టిలో పెట్టుకొని తన కథలో మార్పులు చేసుకుంటారేమో చూడాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాగూర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
నటీనటులు మరియు నిర్మాణం
ఇక అల్లు అర్జున్ తదుపరి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాకా సినిమాలో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పుష్ప ఫ్రాంచైజీ లో మూడవ భాగమైన పుష్ప3 : ది రాంపేజ్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజుతో తన 23వ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే మరో సినిమాని కూడా చేస్తున్నారు. మొత్తానికైతే చేతినిండా సినిమాలతో మరింత బిజీగా మారిపోయారు అల్లు అర్జున్ .మరి పుష్ప సినిమాతో సంచలనం సృష్టించిన ఈయన.. రాకా సినిమాతో ఇంకెలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.
అల్లు అర్జున్ తదుపరి సినిమాలు
మొత్తానికి అల్లు అర్జున్ రాకా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. స్టోరీ లీక్ కావడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. అట్లీ ఈ సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తారో చూడాలి.


