
📌 Key Points
- రాశి ఖన్నా పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం రావడం తన కల నిజం కావడమని తెలిపింది.
- ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో రాశి ఖన్నా ‘శ్లోక’ అనే మోడ్రన్ అమ్మాయి పాత్రలో నటించింది.
- పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ వ్యక్తి అని, ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నానని రాశి పేర్కొంది.
- ఈ సినిమాలో తన పాత్రకు మంచి వేరియేషన్స్ ఉన్నాయని, ఒక మాస్ సాంగ్ కూడా ఉందని రాశి తెలిపింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తన కల అని, పవన్ కళ్యాణ్ గురించి ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
పవన్ కళ్యాణ్ గురించి రాశి ఖన్నా ఏమన్నారంటే?
Raashi Khanna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ (Harish Shankar) కలయికలో రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఉగాది కానుకగా మార్చి 19వ తేదీన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా, ఇందులో హీరోయిన్‌గా నటించిన రాశీ ఖన్నా (Raashi Khanna).. మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు.
‘‘ప్రస్తుతం నా లైఫ్ చాలా బిజీగా ఉంది. నిజం చెప్పాలంటే, పవర్ స్టార్ సినిమా అనగానే కథ కూడా వినకుండా ఎంతో ఉత్సాహంతో ఈ సినిమాకు ఓకే చెప్పేశాను. నేను నా మొదటి సినిమా చేస్తున్నప్పటి నుంచే, పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్ గురించి, పవనిజం గురించి విన్నాను. అప్పుడే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని అనుకున్నాను. ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో నా కల నెరవేరింది. ఇందులో నేను శ్లోక అనే పాత్రలో కనిపిస్తాను. చాలా మోడ్రన్ అమ్మాయిగా కనిపించే పాత్ర. ఇందులో ప్రతి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. నాకు ఇందులో ఓ మాస్ సాంగ్ కూడా ఉంది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో రాశి పాత్ర ఎలా ఉండబోతోంది?
పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే.. ఆయన చాలా సింపుల్ పర్సన్, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. ఆయనలో ఒక తెలియని అమాయకత్వం కూడా ఉంది. మీరు నటి కావాలని ముందే అనుకున్నారా? అని మొదటిరోజే నన్ను అడిగారు. లేదు సార్, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నానని చెప్పా. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు.. కానీ, ప్రతి మాటలో ఎంతో విలువ ఉంటుంది. నాతో ప్రజా సేవ చేయమని చెప్పారు. ఆయన ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఉస్తాద్ వేడుకలో స్టేజ్ మీద నుంచి పవన్ అభిమానులను చూస్తుంటే, ఆయనను ఒక దేవుడిలా ఆరాధిస్తున్నట్లు అనిపించింది. ఇందులో శ్రీలీలకు, నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. నా పాత్రలో కూడా మంచి వేరియేషన్స్ ఉంటాయి.
రాశి ఖన్నా సినీ ప్రయాణం గురించి కొన్ని విషయాలు
హరీష్ శంకర్ చాలా స్మార్ట్. ఆయనకు మాస్ పల్స్ బాగా తెలుసు. ఈ సినిమాకు 120 రోజులు పట్టే షూటింగ్‌ను ఆయన కేవలం 40 నుంచి 45 రోజుల్లోనే పూర్తి చేశారు. సరిగా నిద్ర కూడా పోకుండా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. షూటింగ్ సమయంలో సెట్‌లోనే పంచ్ డైలాగ్స్ రాసి ఇచ్చేవారు. ఓపిక బాగా ఎక్కువ. సినిమా పట్ల ఆయన అంకితభావం చూసి చాలా నేర్చుకున్నాను. ముందుగానే ఆయన ఈ సినిమాకు షెడ్యూల్స్ ఎలా ఉంటాయో చెప్పలేమని అన్నారు. అందుకు తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటానని చెప్పా. కొన్నిసార్లు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటల షిఫ్టులు కూడా పని చేశాను. ఉగాది పండుగ సమయంలో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఫ్యాన్స్ అంతా.. వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని ఇందులో చూస్తారు’’ అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చారు.
మొత్తానికి రాశి ఖన్నా పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయడం తన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా భావిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల కోసం ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


