|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘ఫౌజీ’పై రాహుల్ రవీంద్రన్ సంచలన కామెంట్స్! హిట్ కొట్టాల్సిందేనట! ఫ్యాన్స్ షాక్!

Published: 21-03-2026, 6:05 AM
ప్రభాస్ 'ఫౌజీ'పై రాహుల్ రవీంద్రన్ సంచలన కామెంట్స్! హిట్ కొట్టాల్సిందేనట! ఫ్యాన్స్ షాక్!
  • ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో ‘ఫౌజీ’ చిత్రం!
  • రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
  • రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలో నటన, ఆసక్తికర వ్యాఖ్యలు!
  • భారీ బడ్జెట్, స్టార్ నటులు.. హిట్ కొట్టాల్సిందేనంటున్న రాహుల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా గురించి నటుడు రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఫౌజీ సినిమాపై రాహుల్ కామెంట్స్ వైరల్!

Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఫౌజీ(Fauzi)’. ‘సీతారామం’ వంటి క్లాసిక్ హిట్ తర్వాత హను తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతోంది.

తాజాగా ఈ సినిమా గురించి నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రంలో రాహుల్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఫౌజీ’ సినిమా విజువల్స్ అద్భుతంగా వస్తున్నాయని, మేకింగ్ పరంగా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని తెలిపారు. ఇండియాలోని వివిధ భాషలకు చెందిన పలువురు స్టార్ నటీనటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అవుతున్నారని ఆయన వెల్లడించారు.

హిట్ అవ్వాల్సిందే అంటున్న రాహుల్.. ఎందుకో తెలుసా?

ఈ సినిమా భారీ ఎత్తున తయారవుతోంది. దీని కోసం పెడుతున్న ఖర్చు, పడుతున్న శ్రమ చూస్తుంటే.. కచ్చితంగా ఇది పెద్ద హిట్ అవ్వాల్సిందే” అంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, రాహుల్ చేసిన ఈ కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త కంఫ్యూజన్ లో పడ్డారు. అసలు రాహుల్ ఎం చెప్పాడు. ‘ఫౌజీ’ సినిమా హిట్ అవ్వాల్సిందే అని చెప్పాడా? లేక తప్పకుండా హిట్ అవుతుంది అని చెప్పాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్.. అసలేం జరిగిందంటే?

ఇక పాన్ ఇండియా లెవల్‌లో ప్రభాస్ క్రేజ్‌కు తగ్గట్టుగా, హను రాఘవపూడి మార్క్ ఎమోషన్స్ యాడ్ చేసి ఈ యుద్ధ గాథను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్ అభిమానులు ‘ది రాజాసాబ్’ తర్వాత రాబోతున్న ఈ పీరియడ్ డ్రామా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ పై మేకర్స్ కూడా అధికారిక ప్రకటన చేయనున్నారు అని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న టాక్.

ప్రస్తుతం ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.