|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

36 ఏళ్ల తర్వాత రజనీ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌

Published: 02-08-2025, 11:16 PM
36 ఏళ్ల తర్వాత రజనీ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌

రజనీకాంత్ నటించిన కొత్త సినిమా ‘కూలీ’కి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. 36 ఏళ్ళ తరువాత రజనీకాంత్ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ రావడం విశేషం. ఈ సినిమాలో అధిక హింసాత్మక సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Key Points

1

రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్టు.

2

36 ఏళ్ళ తర్వాత రజనీకాంత్ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్టు లభించడం విశేషం.

4

ఈనెల 14న ‘కూలీ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

‘కూలీ’ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్టు ఎందుకు?

చిత్రాలకు సెన్సార్‌ బోర్డు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చిందంటే ఆ చిత్రాలను 12 ఏళ్ల లోపు పిల్లలు చూడడానికి థియేటర్లో అనుమతించరాదని అర్థం అనే విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలను ఇప్పుడు పెద్దగా ఏ సినిమా థియేటర్‌ నిర్వాహకులు పాటించడం లేదన్నది వేరే విషయం. సాధారణంగా క్రైమ్‌, థ్రిల్లర్‌, హర్రర్‌ కథా చిత్రాలకు, హింసాత్మక సంఘటనలు అధికంగా ఉన్న చిత్రాలకు సెన్సార్‌ బోర్డు ఏ సర్టిఫికెట్‌ ఇస్తుంది. అదే సర్టిఫికెట్‌ను ఇప్పుడు రజనీకాంత్‌ తాజాగా కథానాయకుడు నటించిన కూలీ చిత్రానికి ఇవ్వడం గమనార్హం.

రజనీకాంత్ సినిమాల్లో ‘ఏ’ సర్టిఫికెట్టు చరిత్ర

లోకేష్‌ కనకరాజు దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమీర్‌ఖాన్‌, టాలీవుడ్‌ స్టార్‌ నాగార్జున, శాండిల్‌వుడ్‌ స్టార్‌ ఉపేంద్ర, ,క్రేజీ స్టార్‌ శ్రుతిహాసన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక అదనపు ఆకర్షణగా పూజాహెగ్డే ఐటమ్‌ సాంగ్‌ ఉండనే ఉంది. కాగా అనిరుద్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.

‘కూలీ’ సినిమా విడుదల తేదీ

ఇలాంటి పరిస్థితుల్లో కూలీ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ఏ సర్టిఫికెట్‌ను ఇవ్వడం చర్చనీయంగా మారింది. కారణం ఈ చిత్రంలో భారీగా హింసాత్మక సన్నివేశాలు చోటు చేసుకోవడమే అని తెలిసింది. రజనీకాంత్‌ నటించిన అత్యధిక చిత్రాలు యూ /ఏ సర్టిఫికెట్‌ తోనే విడుదలయ్యాయి. అయితే 1982లో నటించిన పుదుకవితై, రంగా, 1985లో నటించిన ఊరుక్కావాలన్‌, 1989లో నటించిన శివ చిత్రాలు మాత్రం ఏ సర్టిఫికెట్‌తో విడుదలయ్యాయి. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత మళ్లీ కూలీ చిత్రం ఏ సర్టిఫికెట్తో తెరపైకి రాబోతుందన్నది గమనార్హం. అయితే ఈ చిత్ర ట్రైలర్‌ ,ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ హిందూ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు.

రజనీకాంత్ కెరీర్ లో ‘ఏ’ సర్టిఫికెట్ తో విడుదలయ్యే చిత్రాల సంఖ్య తక్కువ. ‘కూలీ’ సినిమా ఈ విషయంలో కొత్త చర్చను రేకెత్తిస్తోంది. సినిమా విజయవంతం అవుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.