
📌 Key Points
- నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘రాకాస’ చిత్రం
- సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు.
- ట్రైలర్‌లో బ్రహ్మరాక్షసుడి భయంకరమైన రూపం
- ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న చిత్రం
జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ‘రాకాస’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఒక పురాతన కోటలో బ్రహ్మరాక్షసుడి భీభత్సం గురించి తెలియజేస్తోంది. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది.
రాకాస ట్రైలర్ విశేషాలు
Rakasa Trailer: జీ స్టూడియోస్ సమర్పణలో మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తోన్న చిత్రం ‘రాకాస’ (Rakasa). దర్శకురాలు మానస శర్మ (Manasa Sharma) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో సంగీత్ శోభన్ (Sangeeth Sobhan), నయన్ సారిక (Nayan Sarika) జంటగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ అంతా మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ వదిలారు. ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వచ్చిన ఈ థియేట్రికల్ ట్రైలర్ (Rakasa Trailer) ఎలా ఉందంటే..
హీరో హీరోయిన్ల నటన
ఒక పురాతనమైన కోటలో ఉన్న భీకరమైన బ్రహ్మరాక్షసుడికి బలి ఇవ్వడం అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. ఆ కోట ఉన్న ఊరి మీద పడి పశువులను చంపేసే ఆ రాకాసి నుండి జనం ఎలా తప్పించుకున్నారు అనే కథా నేపథ్యంలో.. హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమాను రూపొందించారనేది ఈ ట్రైలర్ తెలియజేస్తోంది. బ్రహ్మ రాక్షసుడిగా బలి ఇచ్చే ఊరుకి హీరో సంగీత్ శోభన్ ఎంటరైన తర్వాత ఓ రేంజ్‌లో కామెడీ ఉంటుందనే విషయం కూడా ఈ ట్రైలర్ క్లారిటీ ఇస్తోంది. సంగీత్ శోభన్ తనదైన టైమింగ్‌తో సీరియస్ సీన్స్‌లో కూడా నవ్వులు పూయించే ప్రయత్నం చేశాడు. ‘లవ్ లైన్ చాలా పెద్దగా ఉంది’ అని హీరోయిన్ అడిగితే.. ఆమెకు ఇచ్చే ఇంటెన్స్ సమాధానం యూత్‌ని టార్గెట్ చేస్తోంది.
థ్రిల్లింగ్ విజువల్స్
ఫస్టాఫ్ అంత హీరోహీరోయిన్ల మధ్య సరదా సరదా సీన్లతో, ఎంటర్‌టైన్ చేసే ఈ సినిమా సెకండాఫ్ మాత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందనేలా ఇందులో విజువల్స్ ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆ రాకాసి చేసే అరాచకాలు, హీరో ఆ రాకాసి కోటలోకి వెళ్తే ముందు.. ‘మ్యూజిక్ లోపల ఉంటది’ అని ఇచ్చే బిల్డప్ సీన్స్, హీరో లోపలికి వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ హిలేరియస్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.. అన్నీ బాగా కుదిరినట్లుగా ఈ ట్రైలర్ హింట్ ఇచ్చేస్తోంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భీకరంగా ఉండి సీన్స్‌ని బాగా ఎలివేట్ చేస్తోంది. ఓవరాల్‌గా అయితే, ఏప్రిల్ 3న ఈ వేసవి మొత్తానికి సరిపడా ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఈ సినిమా ఇస్తుందనే ఫీల్‌ని ఇవ్వడంలో ఈ ట్రైలర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ట్రైలర్ చూసేయండి.
మొత్తం మీద ‘రాకాస’ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. హారర్ మరియు థ్రిల్లింగ్ అంశాలతో పాటు కామెడీ కూడా ఉండటంతో సినిమా ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. ఏప్రిల్ 3న సినిమా విడుదల కానుంది.


