|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రష్మిక మాజీ ప్రియుడిపై హీరోయిన్ సంచలన కామెంట్స్! రాత్రి ఏం జరిగిందంటే..?

Published: 08-02-2026, 10:35 AM
రష్మిక మాజీ ప్రియుడిపై హీరోయిన్ సంచలన కామెంట్స్! రాత్రి ఏం జరిగిందంటే..?
  • రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి గురించి రుక్మిణి వసంత్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
  • సప్తసాగరాలు దాటి సినిమా షూటింగ్ సమయంలో అభిమానితో రక్షిత్ ప్రశాంతంగా వ్యవహరించిన తీరును రుక్మిణి గుర్తు చేసుకున్నారు.
  • రక్షిత్ శెట్టి డబ్బు కోసం కాకుండా కథకు ప్రాధాన్యం ఇస్తారని రుక్మిణి అన్నారు.
  • కాంతార 2 సినిమాలో రుక్మిణి వసంత్‌కు అవకాశం రావడం ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయింది.

పాన్ ఇండియా స్టార్ రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి గురించి హీరోయిన్ రుక్మిణి వసంత్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రక్షిత్ శెట్టి సినిమా షూటింగ్ సమయంలో ఒక అభిమానితో ఎలా ప్రవర్తించాడో ఆమె వివరించింది.

రక్షిత్ శెట్టి గురించి రుక్మిణి వసంత్

Rakshit Shetty: పాన్ ఇండియా పరంగా సూపర్ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రష్మిక. రష్మిక త్వరలోనే విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోబోతోంది అన్న విషయం ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అయితే విజయ్ దేవరకొండ కన్నా కూడా ముందు రష్మిక.. రక్షిత్ శెట్టితో ప్రేమలో ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అతనితో నిశ్చితార్థం అయ్యాక.. వారిద్దరికీ బ్రేకప్ అయ్యింది.

ప్రస్తుతం రష్మిక తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉండగా.. అలానే విజయ్ దేవరకొండ అని పెళ్లి చేసుకుంటూ ఉండగా.. ఆమె అభిమానులు రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి.. గురించి కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అప్పుడప్పుడు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ఈ క్రమంలో ఈ మధ్యనే తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన రుక్మిణ వసంత్.. రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పిన కీలక విషయాలు వైరల్ అవుతున్నాయి. సప్తసాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి..తాజాగా అదే సినిమా హీరో రక్షిత్ శెట్టి గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది.

అభిమానితో రక్షిత్ శెట్టి ప్రవర్తన

సప్తసాగరాలు దాటి సినిమా రెండు భాగాలుగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. ఇందులో రుక్మిణి వసంత్, రక్షిత్ శెట్టి మధ్య కనిపించిన కెమిస్ట్రీకి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తర్వాత రుక్మిణికి వరుస అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా కాంతార 2 వంటి పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం ఆమె కెరీర్‌కు కీలకంగా మారింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రుక్మిణి వసంత్, రక్షిత్ శెట్టి వ్యక్తిత్వం గురించి మాట్లాడింది. “రక్షిత్ చాలా డిఫరెంట్ పర్సన్. ఆయన సినిమాలను కేవలం డబ్బు లేదా మార్కెట్ కోసమే చూడరు. ప్రతి కథను ఒక ప్రత్యేక దృష్టితో చూస్తారు. అందుకే ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి” అని ఆమె చెప్పింది.

అలాగే షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను కూడా ఆమె గుర్తు చేసుకుంది. సప్తసాగరాలు దాటి షూటింగ్ జరుగుతున్న సమయంలో అర్ధరాత్రి 2 గంటలకు ఒక అభిమాని ఫోటో కోసం గొడవ చేశాడట. షూటింగ్‌లో కాస్ట్యూమ్స్ లీక్ కాకూడదనే కఠినమైన నియమాలు ఉంటాయి. అయినా కూడా రక్షిత్ శెట్టి ఆ అభిమానితో చాలా ప్రశాంతంగా మాట్లాడారని రుక్మిణి తెలిపింది. దాదాపు అరగంట పాటు అతనికి పరిస్థితిని వివరించి, ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించారట.

రుక్మిణి కెరీర్‌కు కాంతార 2 టర్నింగ్ పాయింట్

“ఆ సమయంలో ఆయన ఎంత కూల్‌గా వ్యవహరించారో చూసి నేను ఆశ్చర్యపోయాను. రక్షిత్ శెట్టి కేవలం మంచి నటుడే కాదు, చాలా మంచి మనసున్న వ్యక్తి కూడా” అంటూ రుక్మిణి ప్రశంసలు కురిపించింది.

ఇక ప్రస్తుతం రుక్మిణి వసంత్, ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో ఆమె మరింత పెద్ద స్టార్‌గా మారుతుందనే అంచనాలు ఉన్నాయి.

రుక్మిణి వసంత్ మాటల్లో రక్షిత్ శెట్టి వ్యక్తిత్వం గొప్పగా వెల్లడైంది. సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం, అభిమానులను గౌరవించే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.