
📌 Key Points
- రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 220.8 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
- రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 1291.2 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.
- ‘గేమ్ చేంజర్’ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ 215.8 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
- రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాతో వస్తున్నారు. ఆయన గత పది చిత్రాల కలెక్షన్ల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రామ్ చరణ్ గత చిత్రాల కలెక్షన్ల వివరాలు
Ram Charan:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచేశాయి. ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలతో పాటు రామ్ చరణ్ గత పది చిత్రాల కలెక్షన్స్ లిస్టు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే పదుల సంఖ్యలో సినిమాలు చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రామ్ చరణ్.. తన గత పది చిత్రాలతో ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టారు? ఏ చిత్రానికి అత్యధిక కలెక్షన్స్ లభించాయి? ఇప్పుడు రాబోయే పెద్ది చిత్రం సంగతేంటి? అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం.. రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన చిత్రాలలో మగధీర, రంగస్థలం వంటి చిత్రాల పేర్లు ప్రధమంగా వినిపిస్తాయి. మగధీర సినిమా ప్రపంచవ్యాప్తంగా 146.8 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయగా.. రంగస్థలం ప్రపంచవ్యాప్తంగా 220.8 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది మొదటి స్థానంలో నిలిచింది.
బ్లాక్ బస్టర్ చిత్రాలు మరియు వసూళ్లు
మిగతా చిత్రాల విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ చిత్రం 1291.2 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయగా ..ఆ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన గేమ్ చేంజర్ 215.8 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. నిజానికి ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా.. ఆర్ఆర్ఆర్ చిత్రం తీసుకొచ్చిన భారీ హైప్ కారణంగా ఈ సినిమాకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ లభించాయి. ఇక తర్వాత ఆచార్య 81.2 కోట్లు, వినయ విధేయ రామ 100.5 కోట్లు ధ్రువ 101.7 కోట్లు , ఎవడు 86.2 కోట్లు, నాయక్ 83.2 కోట్లు రచ్చ 82.8 కోట్ల కలెక్షన్స్ వసూలు చేశాయి.
‘పెద్ది’ సినిమాపై అంచనాలు
ఇక ఇప్పుడు భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెద్ది కలెక్షన్స్ సంగతేంటి ? అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఇకపోతే ఈ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రామ్ చరణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం 1000 కోట్ల క్లబ్లో చేరడం గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్ కెరియర్ లోనే పెద్ది సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఏది ఏమైనా రాంచరణ్ గత పది చిత్రాల కలెక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రామ్ చరణ్ కెరీర్ లో ‘పెద్ది’ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. అభిమానులు ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం.


