
📌 Key Points
- రష్మిక మందన్నాకు ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి గాను గద్దర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా అవార్డు లభించింది.
- ఈ సినిమాలో రష్మిక ప్రేమికుడి షరతులు వద్దనుకునే స్వేచ్ఛా యువతి పాత్రలో నటించింది.
- దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రష్మికను అభినందించగా, రష్మిక ‘మనం అవార్డు కొట్టాం’ అని స్పందించింది.
- తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో రష్మిక అవార్డు గెలుచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది.
రష్మిక మందన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి గాను గద్దర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఆమెను అభినందించారు. ఈ అవార్డుతో రష్మిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
రష్మికకు గద్దర్ అవార్డు: కారణం ఇదే!
Rashmika Mandanna: గత కొన్ని రోజులుగా ఎక్కడ విన్నా రష్మిక మందన్నా (Rashmika Mandanna), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పేర్లే వినిపిస్తున్నాయి. వారిద్దరి ప్రేమ ఫలించి, ఇరు ఫ్యామిలీల అంగీకారంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అలా అయిందో లేదో.. రష్మిక మందన్నాకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అవును, ఈ నేషనల్ క్రష్ తన కెరీర్‌లో మరో ఘనతను దక్కించుకుంది. తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girl Friend) చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డ్ ఆమెని వరించింది. ప్రేమికుడి షరతులన్నీ పక్కనపెట్టి తనదైన స్వేచ్ఛను కోరుకునే యువతిగా ఇందులోని రష్మిక నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా మంచి వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరించారు.
పెళ్లి చేసుకుని ఆనందంలో ఉన్న రష్మికకు ఈ న్యూస్ తెలియడంతో ఆమె సంతోషం రెట్టింపయ్యింది. తను ఎంతో ఇష్టపడి, ప్రేమించి చేసిన పాత్రకు స్టేట్ అవార్డ్ దక్కడంతో సోషల్ మీడియా వేదికగా రష్మిక తన సంతోషాన్ని తెలియజేసింది. అంతకంటే ముందు దర్శకుడు రాహుల్ ‘‘తెలంగాణ స్టేట్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా రష్మిక మందన్నా.. నా హార్ట్ ఆనందంతో డ్యాన్స్ చేస్తుంది. రష్మిక.. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది’’ అని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేయగా.. ‘రాహులా.. మనం అవార్డ్ కొట్టాం’ అంటూ రష్మిక ఇచ్చిన రెస్పాన్స్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చిత్ర నిర్మాతలు కూడా రష్మికకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
Rahullaaaaaaa!! @23_rahulr 🥹🥹🥹🥹❤️
రాహుల్ రవీంద్రన్‌కు రష్మిక ధన్యవాదాలు
We did it! ❤️❤️ https://t.co/kSHQ79P07p
— Rashmika Mandanna (@iamRashmika) March 7, 2026
ఇక రష్మిక ఈ అవార్డు వచ్చిన సంతోషాన్ని మరో ట్వీట్‌లో పంచుకున్నారు. ‘‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 (Telangana Gaddar Film Awards 2025)లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు అందుకోవడం నాకెంతో సంతోషాన్ని, గర్వాన్ని ఇస్తోంది. ఈ చిత్రంలోని ‘భూమా దేవి’ పాత్ర నా హృదయానికి ఎంతో దగ్గరైనది. నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు, గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేనికి, విద్యా అక్కకి, ఇంకా చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. అలాగే, కళలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా అవార్డు గెలుచుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని రష్మిక తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి ప్రశంసలు
Feeling truly grateful and happy to receive the Best Actress award at the Gaddar Telangana Film Awards 2025 for #TheGirlfriend .
‘Bhooma Devi’ is so very very close to my heart and I’ll always be grateful to @23_rahulr , @GeethaArts , @DheeMogilineni , #Vidya akka and the whole team…
— Rashmika Mandanna (@iamRashmika) March 7, 2026
రష్మిక మందన్నా గద్దర్ అవార్డు అందుకోవడం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయి. ఈ అవార్డు ఆమెకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆశిద్దాం. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.


