
📌 Key Points
- యాంకర్ రష్మి గౌతమ్ జబర్దస్త్ షో ద్వారా భారీ ఫేమ్ సంపాదించింది.
- గతంలో సుడిగాలి సుధీర్‌తో రష్మి ప్రేమలో ఉందని అనేక పుకార్లు వచ్చాయి, ప్రస్తుతం వీరిద్దరూ కలిసి కనిపించడం లేదు.
- వచ్చే ఏడాది ఆగస్టులో రష్మి పెళ్లి చేసుకోబోతోందని, అది కూడా మనసులో ఉన్న వ్యక్తితోనే అని ఆస్ట్రాలజర్ జోస్యం చెప్పాడు.
- ఆస్ట్రాలజర్ చెప్పిన విషయాల్లో నిజం ఉందని రష్మి స్పష్టం చేయడంతో నెటిజన్లు ఆమె మనసులో ఉన్నదెవరని ఆరా తీస్తున్నారు.
బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ పెళ్లి వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది ఆగస్టులో రష్మి తన మనసులో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోబోతుందని ఓ ఆస్ట్రాలజర్ చెప్పగా, రష్మి దానిని ధృవీకరించింది. దీంతో ఆమె మనసులో ఉన్నదెవరు అనే చర్చ మొదలైంది.
రష్మి-సుధీర్ ప్రేమ పుకార్లు: నిజమెంత?
బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్(Rashmi Gautam) జబర్దస్త్ షో ద్వారా ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. ఆమె లైఫ్‌కి ఈ షో టర్నింగ్ పాయింట్ అయింది. గుర్తింపు రావడంతో పాటు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా రాబట్టుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండి.. తన హాట్ ఫొటోలతో మరింత క్రేజ్‌ను దక్కించుకుంది. ఇక ఈ షో చేస్తున్న సమయంలోనే.. కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి పలు ఈవెంట్లు, షోలు చేయడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని పలు పుకార్లు వచ్చాయి. ఈ జంట కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారని అంతా చర్చించుకున్నారు. కానీ అనూహ్యంగా గత రెండేళ్లుగా రష్మి, సుధీర్ ఎక్కడా కలిసి కనిపించడం లేదు.
సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోను విడిచి వెళ్లి హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఇక రష్మి విషయానికొస్తే.. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో బిజీ అయిపోయింది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇందులో భాగంగా రష్మి గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో ఓ ఆస్ట్రాలజర్ వచ్చి రష్మి జాతకం గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. వచ్చే ఏడాది ఆగస్టు నెలలో రష్మి పెళ్లి చేసుకుంటుందని.. అది కూడా మనసులో ఉన్న వ్యక్తితోనే వివాహం జరగనుందని చెప్పాడు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన రష్మి.. ఆస్ట్రాలజర్ చెప్పిన విషయాల్లో నిజం ఉందని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. అలాగే యాంకర్ రష్మి మనసులో ఉన్న వ్యక్తి ఎవరు? సుడిగాలి సుధీరేనా లేదా మరెవరైనా ఉన్నారా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రష్మి పెళ్లి తేదీ ఖరారు? ఆస్ట్రాలజర్ జోస్యం
రష్మి మనసులో ఉన్నదెవరు? నెటిజన్ల ప్రశ్నలు
యాంకర్ రష్మి పెళ్లి వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఆమె మనసులో ఉన్న వ్యక్తి సుడిగాలి సుధీరేనా లేక మరెవరైనా ఉన్నారా అని తెలుసుకోవడానికి నెటిజన్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


