|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ ‘ఇరుముడి’: శ్రీరామనవమి కానుకగా అదిరిపోయే పోస్టర్! అసలు విషయం ఇదే!

Published: 26-03-2026, 10:05 PM
రవితేజ 'ఇరుముడి': శ్రీరామనవమి కానుకగా అదిరిపోయే పోస్టర్! అసలు విషయం ఇదే!
  • రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ చిత్రం తెరకెక్కుతోంది.
  • శ్రీరామనవమి సందర్భంగా స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్.
  • ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయినట్టు మేకర్స్ ప్రకటన.
  • హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇరుముడి మూవీ షూటింగ్ అప్డేట్స్

Irumudi: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi Movie). ప్రస్తుతం రవితేజ వరుస ఫ్లాప్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతాడని, ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కారణం ఈ సినిమా దర్శకుడే. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ దాదాపు మంచి చిత్రాలుగా గుర్తింపు పొందాయి. అందుకే ఈ సినిమాపై అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. పాన్-ఇండియన్ పవర్‌హౌస్ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన రవితేజ, ప్రియా భవానీ శంకర్‌ల ఫస్ట్ లుక్‌ పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్‌తో పాటు, శ్రీరామనవమి (Sri Rama Navami) శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ వదిలారు.

శ్రీరామనవమి స్పెషల్ పోస్టర్ విడుదల

షూటింగ్ అప్డేట్ విషయానికి వస్తే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుందని తెలుపుతూ.. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం చిత్ర బృందం హైదరాబాద్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తోందని.. అనల్ అరసు, రియల్ సతీష్ స్టంట్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారని తెలిపారు. ఇటీవలి కాలంలో చూడనటువంటి అత్యంత అద్భుతమైన ఫైట్‌లను ప్రేక్షకులు ఈ సినిమాలో చూడబోతున్నారని టీం చెబుతోంది. యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ ఈ సినిమాలో అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉంటుందని.. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని మేకర్స్ వదిలిన పోస్టర్స్ ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చాయి.

సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ గురించి

శ్రీరామనవమి స్పెషల్‌గా వదిలిన పోస్టర్‌ను గమనిస్తే.. రవితేజ ఇంతకు ముందు పోషించిన పాత్రల్లన్నింటిలోకి విభిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేస్తున్నట్లుగా ఫస్ట్ లుక్ తెలియజేసింది. ఈ చిత్రంలో తన కుమార్తెగా నటించిన బేబీ నక్షత్రతో రవితేజకు ఉన్న బంధాన్ని తెలియజేస్తూ, చిత్ర బృందం ఒక అందమైన, ఆకట్టుకునే పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రవితేజ వింటేజ్, విలేజ్, మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. సాధారణ చెక్డ్ షర్ట్, లుంగీ ధరించి తన కుమార్తెతో కలిసి నడుస్తూ ఉన్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్‌ను చూస్తుంటే తండ్రీకూతుళ్లు మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని అనిపిస్తుంది. తప్పకుండా ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని మేకర్స్ చెబుతున్నారు. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇరుముడి’ చిత్రంపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విడుదలైన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.