|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

RC17 బిగ్ బ్రేకింగ్: చరణ్ సంచలన నిర్ణయం! సుకుమార్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

Published: 09-06-2026, 4:45 PM
RC17 బిగ్ బ్రేకింగ్: చరణ్ సంచలన నిర్ణయం! సుకుమార్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?
  • “పెద్ది” బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ మూడు నెలల బ్రేక్.
  • మణికట్టు ఆపరేషన్, గాయాల నుంచి కోలుకోవడానికి విశ్రాంతి అవసరం.
  • RC17, సుకుమార్ సినిమాకు భారీ జాప్యం, ఫ్యాన్స్ నిరాశ.
  • “రంగస్థలం” కాంబో కోసం ఎదురుచూపులు మరింత పెరిగాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్! బ్లాక్ బస్టర్ “పెద్ది” తర్వాత RC17పై భారీ అంచనాలు నెలకొన్న వేళ, చరణ్ తీసుకున్న సంచలన నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సుకుమార్ సినిమా ఇప్పట్లో మొదలవ్వదా? పూర్తి వివరాలు చూద్దాం!

చరణ్ బ్రేక్ వెనుక అసలు కారణం ఇదే!

RC17 : రామ్ చరణ్ ఇటీవలే పెద్ది సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. థియేటర్స్ లో ఈ సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికే 315 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. చరణ్ పెద్ది తర్వాత సుకుమార్ తో సినిమా ఆల్రెడీ అనౌన్స్ చేసాడు. RC17 అని వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించారు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పుష్ప 3 అవ్వగానే సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టాడని వార్తలు వచ్చాయి. పెద్ది అవ్వగానే చరణ్ తో సుకుమార్ సినిమా చేసేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం అయ్యేలా కనిపించట్లేదు. పెద్ది సినిమా రిలీజ్ తర్వాత చరణ్ ఇప్పుడు మూడు నెలలు బ్రేక్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.

RC17పై అభిమానుల్లో ఆందోళన… ఎందుకంటే?

పెద్ది సినిమా కోసం చరణ్ ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడ్డాడు. అనేక గాయాలు అయ్యాయి. మణికట్టుకు ఆపరేషన్ చేయాల్సి ఉంది. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోడానికి చాలా కష్టపడ్డాడు. దీంతో చరణ్ కి ప్రస్తుతం విశ్రాంతి, మెడికల్ హెల్ప్ చాలా అవసరం. అందుకే చరణ్ అన్ని రకాల టెస్టులు చేయించుకొని, గాయాలు తగ్గించుకొని, మణికట్టు ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకొని మళ్ళీ పర్ఫెక్ట్ గా ఫిట్ గా తయారయి రావడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం మూడు నెలల పాటు బ్రేక్ తీసుకోబోతున్నాడు అని మెగా సన్నిహితుల సమాచారం.

సుకుమార్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

దీంతో మూడు నెలల తర్వాతే సుకుమార్ సినిమా గురించి ఆలోచించాలి అని తెలుస్తుంది. అటు సుకుమార్ కూడా ఇంకా కథని చెక్కే పనిలోనే ఉన్నట్టు తెలుస్తుంది. వీరిద్దరూ కలిసి ఎప్పుడు సినిమా మొదలుపెడతారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

రామ్ చరణ్ కోలుకొని పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి రావాలని ఆశిద్దాం. RC17పై మరిన్ని అధికారిక అప్‌డేట్స్ కోసం వేచి చూడండి. మెగా అభిమానుల ఆశలు త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.