|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: రైస్ తింటూ కూడా రెజీనా అంత సన్నగా ఎలా? వైరల్ అవుతున్న ఫిట్‌నెస్ సీక్రెట్!

Published: 19-02-2026, 11:35 PM
షాకింగ్ న్యూస్: రైస్ తింటూ కూడా రెజీనా అంత సన్నగా ఎలా? వైరల్ అవుతున్న ఫిట్‌నెస్ సీక్రెట్!
  • రెజీనా కాసాండ్రా ఫిట్‌నెస్ సీక్రెట్: రైస్ తింటూనే సన్నగా ఎలా ఉండగలదు?
  • సౌత్ వంటకాలంటే మహా ఇష్టం, రైస్ లేనిదే భోజనం పూర్తి కాదు అంటున్న రెజీనా!
  • శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రెజీనా కాసాండ్రా.
  • ఫిట్‌గా ఉండేందుకు రెజీనా వ్యాయామాలు చేస్తుందట, అందుకే అంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంది!

టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా తన ఫిట్‌నెస్ సీక్రెట్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె రైస్ తింటూ కూడా ఎలా సన్నగా ఉంటుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

రెజీనా ఫిట్‌నెస్ మంత్రం ఏమిటి?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగాలంటే ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమైనది. అద్భుతమైన నటన ఉన్నా కూడా సరైన ఫిట్నెస్ లేనట్లయితే వారికి అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. దానితో హీరోయిన్లు తమ బరువును కంట్రోల్లో ఉంచుకోవడం కోసం, ఫిట్ గా ఉండడం కోసం అనేక కసరత్తులు చేస్తారు, అలాగే ఫుడ్ తినే విషయంలో కూడా ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం హీరోయిన్లు ఫ్యాట్ ఫుడ్ కు చాలా దూరంగా ఉంటారు.

సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమెందుకు?

మరి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఉన్న వంటకాలను దూరం పెడతారు. కానీ ఓ ముద్దుగుమ్మ మాత్రం కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ ను ఇష్టంగా తింటుందట, కానీ ఆమె ఇప్పటికీ ఎంతో ఫిట్ గా ఉంటూ స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. ఆ నటి ఎవరు అనుకుంటున్నారా..? ఆమె మరెవరో కాదు.. రెజీనా కాసాండ్రా. శివ మనసులో శృతి (SMS) సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ చిన్నది చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. ప్రస్తుతం కూడా ఈమె మంచి దశలోనే కెరీర్ను ముందుకు సాగిస్తుంది.

రెజీనా కాసాండ్రా డైట్ సీక్రెట్స్!

తాజాగా ఈమె తన ఫుడ్ డైట్ గురించి క్లియర్గా తెలియజేసింది. తనకు సౌత్ వంటకాలు అంటే చాలా ఇష్టం అని, అందులో ముఖ్యంగా రైస్ లేకుంటే భోజనం సంతృప్తి కాదు అని తెలియజేసింది. నేను పక్కా రైస్ లవర్ ని, రోజులో కనీసం కొద్దిపాటి అన్నం అయినా తినాల్సిందే. పప్పు అన్నం, రసం అన్నం, ఇలా ఏదో ఒక రకంగా రోజు నేను తీసుకునే ఆహారంలో రైస్ కచ్చితంగా ఉంటుంది. అది లేకపోతే నా భోజనం అసంతృప్తిగా అనిపిస్తుంది అని చెప్పింది. రైస్ ఎక్కువగా తీసుకున్నప్పటికీ అందుకు తగిన వ్యాయామాలు చేసి మళ్లీ ఫిట్గా ఉంటాను అని రెజీనా చెప్పుకొచ్చింది.

రెజీనా తన డైట్ సీక్రెట్స్ రివీల్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఫిట్‌నెస్ రహస్యం తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.