
📌 Key Points
- రేణు దేశాయ్ సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- తన NGO గురించి, కుక్కల సంరక్షణ గురించి ఆమె చేసిన పోరాటాలపై నెటిజన్లు అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు.
- వ్యక్తిగత దూషణలు చేస్తున్న నాలుగు సోషల్ మీడియా ఖాతాల వివరాలను ఆమె పోలీసులకు అందజేశారు.
- కామెంట్స్ చేసే వారి ఇంటికి వెళ్లి మరీ పోరాటం చేస్తానని రేణు దేశాయ్ హెచ్చరించారు.
నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకర కామెంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత జీవితం, NGO కార్యక్రమాలపై కొందరు నెటిజన్లు అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రేణు దేశాయ్ సైబర్ క్రైమ్ ఫిర్యాదు
Renu Desai: నటి రేణు దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలియంది కాదు. తాజాగా ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను (Cybercrime Complaint) ఆశ్రయించారు. సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్‌తో వేధిస్తున్న (Social Media Harassment) వారిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఎక్స్‌లో ఆమెకు అకౌంట్ లేదు కానీ, ఇన్‌స్టాలో మాత్రం ఎప్పుడూ ఆమె ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా తన ఎన్‌జీఓకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటారు. ఈ మధ్య కుక్కల విషయంలో ఆమె ఎలా ఫైట్ చేస్తున్నారో తెలిసిందే. ఆ మధ్య ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఒక్కొక్కరికీ ఇచ్చి పడేశారు. 100 కుక్కల్లో 10 కుక్కలు మాత్రమే మంచివి ఉండవని, అలా అని 100 కుక్కలను ఎలా చంపేస్తారంటూ ఆమె గొంతెత్తారు.
సోషల్ మీడియా వేధింపులపై రేణు ఆగ్రహం
అంతేకాదు, సమాజంలో చిన్న పిల్లల్ని మొదలుకుని, పండు ముదుసలి వరకు ఆడవాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ అత్యాచారాలు చేసే వాళ్ల విషయంలో ప్రభుత్వాలను ప్రశ్నించరు కానీ, ఇప్పుడు కుక్కలను చంపవద్దు అన్నందుకు.. నాపై లేనిపోని రాతలు, పోస్ట్‌లు చేస్తున్నారంటూ ఇటీవల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఆమె పోరాటం చేస్తున్నందుకు కొందరు నెటిజన్లు కావాలని పచ్చి బూతులు తిడుతున్నారని, ఇంట్లో పిల్లల్ని కూడా వదలడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో ఆమె తెలిపారు. ఇంకా ఆమెపై ఎలాంటి పదప్రయోగాలు చేస్తున్నారో కూడా ఈ వీడియోలో ఆమె వెల్లడించారు. ఇకపై అలాంటి కామెంట్స్ చేసే వాళ్లని వదిలిపెట్టేది లేదని, ఆ కామెంట్స్ చేసే వాళ్ల ఇంటికి వెళ్లి మరీ పోరాటం చేస్తానని రేణు దేశాయ్ హెచ్చరించారు. అయినా కూడా కొందరు నెటిజన్లు పద్దతి మార్చుకోకుండా, అలానే ప్రవర్తిస్తుండటంతో.. చేసేది లేక ఆమె సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు.
పోలీసులకు ఆధారాలు అందజేసిన రేణు
తనపై హద్దులు దాటి వ్యక్తిగత దూషణలు చేస్తున్న నాలుగు సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను సేకరించి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ నాలుగు అకౌంట్లలోని వారు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారో.. మొత్తం స్క్రీన్‌షాట్లు, లింకులతో సహా పోలీసులకు అందజేసినట్లుగా సమాచారం. రేణు దేశాయ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో రేణు దేశాయ్‌కి పూర్తి న్యాయం జరిగేలా.. స్పష్టమైన హామీ పోలీసుల నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ నలుగురి ఆట కట్టించి, సోషల్ మీడియాలోని అలాంటి వారికి తగిన హెచ్చరికను ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారట. సో.. నెటిజన్లు (అందరూ కాదు.. కొందరు) ఇకనైనా మంచి భాషను వాడితే మంచిది.. లేదంటే ఈ రోజు ఆ నలుగురే కావచ్చు.. రేపు మీ వరకు రావచ్చు.. అనేలా నెటిజన్లు కొందరు కామెంట్లతో రేణు దేశాయ్‌కి సపోర్ట్ చేస్తున్నారు.
రేణు దేశాయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


